అచ్చేదిన్ పోయి సచ్చేదిన్ వచ్చాయి; బడ్జెట్ విషయంలో బీజేపీనేతలకు మంత్రి ఎర్రబెల్లి సవాల్!!
కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ నేతల నుండి ఆగ్రహజ్వాలలు వెల్లువగా మారాయి. తాజాగా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. ఈ బడ్జెట్ తో అచ్చే దిన్ పోయి, సచ్చే దిన్ వచ్చేశాయని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వస్తే, అచ్చే దిన్ ఆయేగా అని చెప్పారు... ప్రజలు నమ్ముతూ వచ్చారు.
కానీ, అచ్చేదిన్ రానీ, రాకపోనీ, తాజా బడ్జెట్ జనం సచ్చేదిన్ మాత్రం ఖాయంగా వచ్చినట్లే కనిపిస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణాకు అన్నీ కోతలే
ఉపాధి హామీకి 25వేల కోట్ల కోత విధించారని మండిపడ్డారు. గ్రామీణాభివృద్ధి శాఖకు సైతం కేటాయింపులను తగ్గించారని పేర్కొన్నారు. మిషన్ భగీరథ కు మరోసారి మొండి చేయే మిగిలి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి కేంద్ర సహాయ నిరాకరణ అవలంబిస్తోందని, ఎరువుల ధరలకు రెక్కలు వచ్చాయని, విభజన హామీలను తిలోదకాలిచ్చారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ యూనివర్సిటీలు సరే, మా గిరిజన యూనివర్సిటీ సంగతేంటి? అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు.

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేదు
కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ...బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కుచ్ భీ నహీ అంటూ పేర్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది అంటూ మండిపడ్డారు. ఎందుకీ వివక్ష అంటూ ప్రశ్నించారు. అవార్డులిస్తున్న రాష్ట్రానికి ప్రశంసలే తప్ప నిధులేవి? అంటూ కేంద్రాన్ని నిలదీశారు. నిష్ప్రయోజక, నిరర్దక బడ్జెట్ గా పేర్కొన్న మంత్రి, అధికారంలోకి రావడానికి ఎన్నో కోతలు కోశారు అని అందుకు విరుద్ధంగా, బడ్జెట్ లో అన్నీ కోతలే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. గతప్రభుత్వం ప్రవేశ పెట్టిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ వచ్చిన బిజెపి ప్రభుత్వం, తాజాగా గ్రామీణ అభివృద్ధికి ఎంతో మేలు చేస్తున్న ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు పూనుకున్నదన్నారు.

ఉపాధి హామీ నిధుల్లోనూ కోత
కరోనా నేపథ్యంలో నిరుద్యోగులు గ్రామాలకు వెళ్ళి ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఆ అవకాశం కూడా దక్క కుండాకేంద్రం చేసిందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఉపాధి హామీకి ఇంతకుముందు 98వేల కోట్లు ఉండగా, ఇప్పుడు 73వేల కోట్లకు కుదించారని ఆయన అన్నారు. అంటే 25వేల కోట్ల కోత కోశారని స్పష్టం చేశారు.
గ్రామీణాభివృద్ధి శాఖకు సైతం కేటాయింపుల తగ్గింపుచేశారు. మన మిషన్ భగీరథ ను కాపీ చేసి అమలు చేస్తున్న జల్ శక్తి మిషన్ పథకంలో భాగంగా నీతి అయోగ్ సిఫారుసలకు విరుద్ధంగా కనీసం 19వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది. ఇక దానిని కూడా ఏ మాత్రం పట్టించుకోలేదని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. మిషన్ భగీరథకు మరోసారి మొండి చేయి మిగిలిందన్నారు.
గత రెండేళ్లలో నల్ సే జల్ కింద 5.7 కోట్ల కుటుంబాలకు అందుబాటులోకి తాగునీరు తెచ్చామని చెబుతున్నప్పటికీ, నల్ సే జల్ కింద కూడా మన రాష్ట్రం లేకపోవడం విచారకరమని మంత్రి ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

యూరియా మీద సబ్సిడీ తగ్గించి వ్యవసాయానికి సహాయ నిరాకరణ
వ్యవసాయానికి పూర్తిగా సహాయ నికారణ చేశారని, యూరియా మీద సబ్సిడీని 12708 కోట్లు తగ్గించారు. ఇతర ఎరువుల మీద 22190కోట్లు తగ్గించారు. మొత్తం 34900 కోట్లు ఎరువుల మీద సబ్సిడీని తగ్గించారు. దీంతో ఇక రైతులకు వ్యవసాయం భారంగా మారే ప్రమాదం ఏర్పడిందని ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిధులు అడిగామని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు అడిగామని పేర్కొన్న ఎర్రబెల్లి, ఐఐఎం, కేంద్రీయ, జవహర్ నవోదయ విద్యాలయాలు వంటి జాతీయ విద్యా సంస్థలను, ఐటిఐఆర్ వంటి ప్రాజెక్టులు ఇస్తామన్నారు. అసలు ఏ విషయాన్నీ కేంద్రం తన బడ్జెట్ లో పట్టించుకున్న దాఖలాలే లేవని అసహనం వ్యక్తం చేశారు.

ఎల్ఐసీని ప్రైవేట్ పరం చేస్తారా?
మన రాష్ట్రం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తూ, ఇన్సూరెన్స్ సంస్థలను బతికిస్తుంటే, కేంద్రం ప్రజలు ఎక్కువగా నమ్మే ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేస్తామని ప్రకటించడం అంత దారుణం, విచారకరమైన విషయం మరోటిలేదని మంత్రి తెలిపారు.రాష్ట్రాలకు ఆర్థికసాయంగా రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారని, ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు అందిస్తామన్నారని పేర్కొన్న ఎర్రబెల్లి ఉన్న నిధులకే దిక్కులేని కోతలు విధిస్తూ, కొత్తగా కేంద్రం అప్పులు ఇస్తుందంటే నమ్మశక్యంగాలేదన్నారు. అప్పులు ఇవ్వడానికి కేంద్రం ప్రభుత్వ పరంగా పని చేస్తున్నదా? లేక వడ్డీ వ్యాపారం చేస్తున్నదా? అని మంత్రి ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు.

విభజన హామీలకు తిలోదకాలు.. వరంగల్ టెక్స్ టైల్స్ పార్క్ నిధుల మాటేంటి?
కేంద్ర ప్రభుత్వం విభజన హామీలకు తిలోదకాలు ఇచ్చినట్లుగా కనిపిస్తున్నదని, ఆఊసే లేకుండా బడ్జెట్ ఉండటం పట్ల మంత్రి ఎర్రబెల్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన లేదని వ్యాఖ్యానించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి స్థలం కూడా ముందుగా 50 ఎకరాలు, తర్వాత 100 ఎకరాలు అడిగితే, 150 ఎకరాల స్థలం ఇచ్చాం.ఈ బడ్జెట్ లో కూడా కనీసం ఆ ప్రస్థావనే లేదని మంత్రి ఎర్రవెల్లి అన్నారు. వరంగల్ టెక్స్ టైల్ పార్క్ కు నిధుల ఊసు లేదన్నారు.
Recommended Video

రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి
అసలు తెలంగాణ పట్ల బిజెపికి ఇంత వివక్ష దేనికి?మిషన్ భగీరథ, రైతు బంధు, తాజాగా రిజిస్ట్రేషన్ల పద్ధతి వంటి అనేక పథకాలను కాపీ కొట్టారన్నారు. ఉపాధి హామీకి నిధులు తగ్గించారు. గ్రామీణ నిరుద్యోగులకు ఏం చెబుతారు? అని ప్రశ్నించారు. ఇక ఇప్పుడు రాష్ట్ర బిజెపి నేతలు మాట్లాడాలన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతెలంగాణ బిడ్డలుగా రాష్ట్రానికి మీరు తెచ్చింది, మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందేంటో ప్రజలకు చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిజెపి నేతలకు సవాల్ విసిరారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications