హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మతఘర్షణలు రెచ్చగొట్టటం కోసమే అస్సాం సీఎం హైదరాబాద్ కు వచ్చారు: మంత్రి ఎర్రబెల్లి ఫైర్!!

|
Google Oneindia TeluguNews

అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వ శర్మ పై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరుగుతున్న హైదరాబాద్ లో మత ఘర్షణలు రెచ్చగొట్టడం కోసమే అస్సాం ముఖ్యమంత్రి వచ్చారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. అస్సాం లో గణేష్ నిమజ్జన వేడుకలలో పాల్గొనకుండా హైదరాబాద్ రావడం వెనక ఆంతర్యం ఏమిటో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు.

రాజకీయ దురుద్దేశంతో బీజేపీ మత ఘర్షణలు సృష్టించే కుట్ర

రాజకీయ దురుద్దేశంతో బీజేపీ మత ఘర్షణలు సృష్టించే కుట్ర

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణలో రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ మత ఘర్షణలు రెచ్చగొట్టే కుట్రలు చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. హైదరాబాద్ మహానగరంలో ప్రశాంతంగా ఎప్పుడూ గణేష్ నిమజ్జనోత్సవం జరుగుతుందని, కానీ ఇప్పుడు ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కెసిఆర్ సారథ్యంలో ఎనిమిదేళ్ల నుండి ఎలాంటి అల్లర్లు లేకుండా హైదరాబాద్ లో నిమజ్జనం జరుగుతుందని పేర్కొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

అస్సాం సీఎం హైదరాబాద్ కు ఎందుకు వచ్చాడు?

అస్సాం సీఎం హైదరాబాద్ కు ఎందుకు వచ్చాడు?

ఈసారి గతానికి భిన్నంగా బిజెపి మత రాజకీయాలు చేయడానికి ప్రయత్నించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా గణేష్ నిమజ్జనం జరుగుతుందని, అస్సాం రాష్ట్రంలో కూడా గణేష్ నిమజ్జనం జరుగుతుందని పేర్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు, అస్సాం సీఎం తెలంగాణ రాష్ట్రానికి రావడంపై అసహనం వ్యక్తం చేశారు. అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ రాకవల్ల నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని ఆయన విమర్శించారు.

అస్సాం సీఎం మైక్ లాక్కున్న టీఆర్ఎస్ కార్యకర్త

ఇదిలా ఉంటే అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ గణేష్ నిమజ్జనం సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటుచేసిన వేదికపై మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక టీఆర్ఎస్ నేత నందు బిలాల్ ఒక్కసారిగా వెనకనుంచి చొచ్చుకొని వచ్చి ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు . మైక్ లాక్కుని అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ తో వాగ్వాదానికి దిగారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట, ఉద్రిక్తత

బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట, ఉద్రిక్తత


కమిటీ సభ్యులు నందు బిలాల్ ను వేదిక మీద నుంచి కిందకు దించగా, పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ బిజెపి, టిఆర్ఎస్ పార్టీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అని ఉద్రిక్తంగా మారింది. ఇరుపార్టీల నేతలు తోపులాటకు పాల్పడ్డారు. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అస్సాం ముఖ్యమంత్రి హైదరాబాదులో పర్యటన పై టిఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. అసలు ఆయన హైదరాబాద్ కు రావాల్సిన అవసరం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.

English summary
Assam CM come to Hyderabad to incite communal clashes. Minister Errabelli Dayakar Rao got fired up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X