ఆ రోజే కిరణ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు, అన్ని విషయాలు తెలుసుకున్నాం: ఈటెల

తమ ప్రభుత్వం నయీం లాంటి వారు చేసే అరాచకాలను సహించదని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం నాడు అన్నారు.

హైదరాబాద్: తమ ప్రభుత్వం నయీం లాంటి వారు చేసే అరాచకాలను సహించదని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం నాడు అన్నారు. తెలంగాణ శాసన సభలో గ్యాంగ్ స్టర్ నయీం కేసు పైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడారు.

తమ ప్రభుత్వం ఈనాడే కాదని, అసలు ఏనాడూ కూడా న‌యీం లాంటి వారు చేసే అరాచ‌కాల‌ను స‌హించ‌బోద‌న్నాపు,తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొంటున్న‌ప్ప‌టి నుంచే త‌మ‌కు, త‌మ నాయ‌కుడు కేసీఆర్‌కు ఎన్నో అంశాల గురించి తెలుసని చెప్పారు.

కాంగ్రెస్ హ‌యాంలోనే న‌యీం ఆగ‌డాలు వెలుగుచూశాయన్నారు. న‌యీం ఆగ‌డాల‌పై అప్పుడు తాము మొత్తం ప‌దిసార్లు ఫిర్యాదులు చేశామన్నారు. కిర‌ణ్ కుమార్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు త‌మ‌ పార్టీ ఫ్లోర్ లీడ‌ర్‌కు బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని ఫిర్యాదు చేశామని చెప్పారు.

అయినా వారు పట్టించుకోలేద‌న్నారు. పార్టీ ఫ్లోర్ లీడ‌ర్‌కే ర‌క్ష‌ణ లేక‌పోతే ఇక మరెవరికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తారని ఆయ‌న ప్ర‌శ్నించారు. న‌యీం విష‌యంలో ఏనాడు ప‌ట్టించుకోని కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడు ఏవేవో మాట్లాడుతున్నార‌న్నారు.

 Minister Etela Rajender responds on Nayeem case in Assembly

తెలంగాణ ఏర్ప‌డిన తర్వాత ఇలాంటి వారి చ‌ర్య‌లను ఏ మాత్రం స‌హించ‌డం లేదని చెప్పారు. చ‌ట్టాన్ని న‌డిపించాల్సింది ప్ర‌భుత్వమే త‌ప్ప, నేర‌స్తులు కాదని, దీనిని కేసీఆర్ రుజువు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక్క వ్య‌క్తి కోసం ఏనాడు పని చేయదన్నారు.

తెలంగాణ ఉద్య‌మ సంద‌ర్భంలోనే తాము అన్ని విష‌యాలు తెలుసుకున్నామ‌ని, ప్ర‌జ‌లను క‌ష్టపెట్టే వారిపై క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రిస్తామ‌న్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గులను ఎప్ప‌టికీ క్ష‌మించ‌దన్నారు.

పెద్ద నోట్ల రద్దుపై..

రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం పెరిగిందని, సేల్స్ ట్యాక్స్‌ గతేడాది కంటే 22 శాతం పెరిగిందన్నారు. వాహనాలపై 33 శాతం, సాంపులు, రిజిస్ట్రేషన్లపై 56 శాతం, భూములు అమ్మకం, ఇతర ఆదాయం .45 శాతంగా ఉందన్నారు. మొత్తంగా రాష్ట్ర ఆదాయంలో 13 శాతం వృద్ధి ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+