ధాన్యం కొనుగోలులో మంత్రి గంగులకు చిత్తశుద్ది లేదు.!పదవికి రాజీనామా చెయాలని కాంగ్రెస్ డిమాండ్.!

హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు అంశంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా గంగుల కమలాకర్ కు చిత్తశుద్ది లేదని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ధాన్యం కొలుగోలు విషయంలో ప్రభుత్వం ఏం చెప్పింది, ఎంత ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేసిందో పౌరసరఫరాల శాఖ మంత్రిగా గంగుల కమలాకర్ కు ఏమీ తెలియది, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు, గంగుల కమలాకర్ చెప్పే అంశాలకు సంబంధమే లేదని మండిపడ్డారు. కమలాకర్ నోటికొచ్చిన అంకెలు చెబుతున్నారని, అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఆయనకు అవగామన లేదని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ సంకెట అన్వేష్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.

ధాన్యం కొనుగోలులో బాద్యతారాహిత్య ప్రకటనలు.. మంత్రి గంగులపై కాంగ్రెస్ ఫైర్..

ధాన్యం కొనుగోలులో బాద్యతారాహిత్య ప్రకటనలు.. మంత్రి గంగులపై కాంగ్రెస్ ఫైర్..


అసత్యాలు, అబ్దాలతో ప్రజలను మభ్య పట్టే గంగుల కమలాకర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి డిమాండ్ చేసారు. కరోనా సమయంలో ధాన్యాన్ని కేవలం తెలంగాణ ప్రభుత్వమే కొంటోందని చెబుతున్న మంత్రి కమలాకర్, ఆయన రోజూ కనీసం పేపర్ అయినా చదవుతారా? వార్తలు చూసి నిజాలు అయినా తెలుసుకుంటారా? అన్న అనుమానం కలుగుతోందన్నారు అన్వేష్ రెడ్డి. మంత్రికి కనీస ఆలోచన, విచక్షణా జ్ఞానం ఉన్నాయా అన్న సందేహం కూడా కలుగేతోందని, రైతుల బాధలు, కష్టాలు, మంత్రి హోదాలో ఉన్న కమలాకర్ కు తెలుసా అని అన్వేష్ రెడ్డి ప్రశ్నించారు.

ప్రభుత్వానికి, అధికారులకు సమన్వయం లేదు.. అంతా గందరగోళమేనన్న టీపిసీసీ

ప్రభుత్వానికి, అధికారులకు సమన్వయం లేదు.. అంతా గందరగోళమేనన్న టీపిసీసీ


తెలంగాణ ప్రభుత్వం 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, 20 వేల గన్ని బ్యాగులను ధాన్యం కోసం సిద్ధం చేసిందని చెబుతున్న మంత్రికి కనీస వాస్తవాలు తెలియవని మండిపడ్డారు. మంత్రి వాస్తవాలు చెబుతున్నారా లేక నోటికొచ్చిన లెక్కలు చెబుతున్నాడా అన్న సందేహం కలుగుతోందని అన్వేష్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకుందని, అందులో భాగంగా 8,526 వేల కోట్ల రూపాయలతో 45లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని అన్వేష్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ లక్ష్యంలో 50 శాతం పూర్తయినట్టుగా మంత్రి చెబుతున్నారని, కానీ ఇందులో వాస్తవాలను ఒకసారి గమనిస్తే అసలు విషయాలు అందరికీ తెలుస్తాయని అన్వేష్ రెడ్డి తెలిపారు.

పంటకొనుగోలులో ప్రభుత్వ లెక్కలు కూడా గంగులకు తెలియదు.. మంత్రి అవాస్తవాలు చెప్తున్నాడన్న కాంగ్రెస్..

పంటకొనుగోలులో ప్రభుత్వ లెక్కలు కూడా గంగులకు తెలియదు.. మంత్రి అవాస్తవాలు చెప్తున్నాడన్న కాంగ్రెస్..


తెలంగాణలో ఉత్పత్తి అయిన దాన్యంలో రైతులు తమ అవసరాలకు నిల్వ పెట్టుకోగా మిగిలిన మొత్తం కోటీ 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంటుందని, అందులో మూడో వంతు అంటే ప్రభుత్వం చెబుతున్న 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించిందని, మిగిలిన ధాన్యాన్ని ఎప్పటిలోగా సేకరిస్తారో, ఆ మొత్తాన్ని రైతుల నుండి ఎప్పటిలోగా కొనుగోలు చేస్తుందో ప్రభుత్వం కచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉందని అన్వేష్ రెడ్డి తెలిపారు.

తడిసిన ధాన్యాన్ని కొంటామన్న ప్రభుత్వం.. మార్కెట్ లో మాత్రం కొనడంలేదంటున్న కాంగ్రెస్

తడిసిన ధాన్యాన్ని కొంటామన్న ప్రభుత్వం.. మార్కెట్ లో మాత్రం కొనడంలేదంటున్న కాంగ్రెస్


ప్రభుత్వం 20 వేల గన్నీ బ్యాగులు సమకూరుస్తోందన్న మాట పూర్తిగా అబద్దమని, ఇప్పటికీ అనేక ప్రాంతాలలో గన్నీ బ్యాగులు లేక, ధాన్యం రాసులుగా కుప్పలుగా పోసిఉందని, తడిసిన దాన్యాన్ని కొపనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలను అధికారులు ఎక్కడా పట్టించుకోవడం లేదని, తడవని దాన్యానికే కడ్తా తీసి దోచుకొంటుంటే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే ఉంచుతున్నారని తెలిపారు.తడిసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ఎక్కడా కొనుగోలు చేయడం లేని పరిస్థితి ఉందని, అధికారులు ఇంకా అనేక రకాలుగా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని, మిల్లర్లు సుమారుగా క్వింటాలకు 5 కిలోల పైనే తరుగు తీసి కొంటున్నారని అన్వేష్ రెడ్డి తెలిపారు.

తరుగు పేరుతో అవినీతి.. రైతు నడ్డి విరుస్తున్న యంత్రాంగం అంటున్న అన్వేష్ రెడ్డి..

తరుగు పేరుతో అవినీతి.. రైతు నడ్డి విరుస్తున్న యంత్రాంగం అంటున్న అన్వేష్ రెడ్డి..


తరుగు తీయడంలోనే అతి పెద్ద అవినీతి జరుగుతోందని, కొనుగోలు కేంద్రాల్లో 2 నుండి 3 కిలోలు, మిల్లర్లు 3 నుండి 5 కిలోల వరకు తరుగు తీస్తున్నారని, క్వింటాలకు దొరికినంత తరుగు తీస్తూ వేల కోట్ల రూపాయాల స్కామ్ ఇక్కడ జరుగుతుందని, దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇలాగే జరువుతోందని అన్వేష్ రెడ్డి తెలిపారు. 45లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలులో తరుగు పేరుతో ఇంత పెద్ద మొత్తంలో అవినీతి కుంభకోణం జరుగుతుంటే, మంత్రిగా ఉండి కూడ గంగుల కమలాకర్ ఎందుకు స్పందించ లేదని, ఈ స్కామ్ లో ఆయనకు కూడా వాటా ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయని చెప్పారు.హుజూరాబాద్ నియోజకవర్గ రాజకీయాలు, ఉప ఎన్నికలపై ద్రుష్టి పెట్టే గంగుల కమలాకర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని అన్వేష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+