'అడ్రస్ గల్లంతే.. అంతా కేసీఆర్ మాస్టర్ ప్లాన్, కాంగ్రెస్‌ది రాద్దాంతం'

Subscribe to Oneindia Telugu

మెదక్: తెలంగాణ సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్‌తో కాంగ్రెస్, బీజేపీల అడ్రస్ గల్లంతయ్యిందన్నారు మంత్రి హరీష్ రావు. ఎక్కడ ఉనికిని కోల్పోతామోనన్న భయంతోనే రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారని మండిపడ్డారు.

సోమవారం మెదక్ జిల్లా తూప్రాన్‌లో జరిగిన రైతు అవగాహన సభలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీకి రైతులే గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా హరీష్ పిలుపునిచ్చారు. తమ పాలనలో ఎన్నడూ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్.. ఇప్పుడు మాత్రం టీఆర్ఎస్ సర్కారును విమర్శించడం సిగ్గుచేటని అన్నారు.

minister harish rao fires on congress, bjp

వ్యవసాయ రంగానికి 24గం. కరెంటుతో పాటు సాగు కోసం ఎకరానికి రూ.8వేల పెట్టుబడి అందిస్తున్నామని, కాంగ్రెస్ మాత్రం రాద్దాంతం చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డితో పాటు ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

పోటీ ఉంటే లాటరీ:

రామాయంపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి ఆయన ప్రస్తావించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత.. పోటీ ఉంటే గనుక లాటరీ వేసి అర్హులను ఎంపికచేస్తామని హరీష్ తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Minister Harish Rao fired on Congress and Bjp. He alleged that both parties are opposing the development in the state

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X