హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలకృష్ణ పైకి కరుకు.. మనసు సాఫ్ట్: హరీష్ రావు కితాబు; బాలయ్య కూడా తగ్గలేదుగా!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఏపీ టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ పై ప్రశంసల జల్లు కురిపించారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 22 వ ఫౌండేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మూడు రంగాల్లో బాలకృష్ణ రాణిస్తున్నారు : మంత్రి హరీష్ రావు

సినిమారంగంలో, రాజకీయరంగంలో, సేవారంగంలో బాలకృష్ణ తనదైన శైలిలో రాణిస్తున్నారని, అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఫౌండేషన్ డే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు ఎన్టీఆర్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంతో అభిమానమని వెల్లడించారు. నైట్ షెల్టర్ ఏర్పాటు చేయాలని సీఎం చెప్పగానే బాలకృష్ణ అమలు చేశారని, ఇక బాలకృష్ణ అడగ్గానే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ కింద ఆరు కోట్ల భారం పడకుండా కెసిఆర్ చేశారని హరీష్ రావు పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం క్యాన్సర్ రోగులకు ఇప్పటివరకు 753 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది

క్యాన్సర్ రోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు 753 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది అని పేర్కొన్న హరీష్ రావు ఇందులో అత్యధికంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లిందని స్పష్టం చేశారు. ఇరవై రెండు సంవత్సరాల్లో మూడు లక్షల మంది క్యాన్సర్ రోగులకు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సేవలు అందించడం గొప్ప విషయం అని హరీష్ రావు ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లకు వైద్యం అందిస్తున్న ఆసుపత్రులలో బసవతారకం ఆసుపత్రి రెండవ స్థానంలో ఉందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

బాలకృష్ణ పైకి కరుకుగా కనిపించినా ఆయన మనసు చాలా సాఫ్ట్


హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత బాలకృష్ణ తన దగ్గరకి రెండుసార్లు వచ్చారని, బాలకృష్ణ పైకి కరుకుగా కనిపించినా ఆయన మనసు చాలా సాఫ్ట్ అని మంత్రి హరీష్ రావు కితాబిచ్చారు బయట బాలకృష్ణ వేరు లోపల బాలకృష్ణ వేరు అంటూ హరీష్ రావు తెలిపారు. ఇక ఇదే సమయంలో దేశవ్యాప్తంగా క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నారని మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలోనూ ప్రధాన ఆసుపత్రులలో కీమోథెరపీ, రేడియోథెరపీ ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

750 పడకల ఆస్పత్రిగా ఎంఎన్ జె ఆసుపత్రిని అప్ గ్రేడ్ చేస్తున్నాం

ఎంఎన్ జె ఆసుపత్రిని 750 పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేస్తున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నిమ్స్ లో ఎనిమిది మందికి, ఎంఎన్ జే ఆస్పత్రిలో ఇద్దరికీ ప్రతినెలా ఉచితంగా న్యూరో బోన్ సర్జరీ చేస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. క్యాన్సర్ ను గుర్తించడం చాలా కష్టంగా మారిందని పేర్కొన్న హరీష్ రావు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఆరోగ్యం పట్ల చైతన్యం పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మంత్రి హరీష్ రావుకు బాలయ్య ప్రశంసల జల్లు

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ అటల్ బిహారీ వాజ్పేయి చేతులమీదుగా హాస్పిటల్ ను ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి హరీష్ రావును ఉద్దేశించి ఆయన ప్రజల మనిషి అంటూ బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్ రావు ఆదర్శవంతమైన నాయకుడు అంటూ బాలకృష్ణ తేల్చిచెప్పారు. ఆయనను తాను వెళ్లి కలిశానని ఆసుపత్రి విషయంలో తనకు ఎంతగానో సహకారం అందించారని బాలయ్య తెలిపారు. తన తల్లి బసవతారకం కోరిక మీద ఆసుపత్రిని ప్రారంభించినట్లు గుర్తు చేసుకున్న బాలయ్య ఇప్పటికి ఎంతో మంది దాతలు ఆసుపత్రికి సహాయం చేస్తున్నారని, వారందరికీ తన కృతజ్ఞతలు తెలియజేశారు.

English summary
Minister Harish Rao said that Balakrishna looks so harsh and his mind is soft. Balayya also lauded Minister Harish Rao as a man of the people. This interesting scene took place on the 22nd Foundation Day of Basava Tarakan Cancer Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X