తెలంగాణా కేసీఆర్ అడ్డా.. డిపాజిట్లు దక్కించుకునే కమిటీలు వేసుకోండి: మంత్రి హరీష్ రావు!!

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లాలో నేడు మంత్రి హరీష్ రావు పర్యటించారు. మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో 140 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

హజీపూర్ మండలం పడ్తనపల్లిలో 85 కోట్లతో నిర్మించే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బిజెపి లపై విరుచుకుపడ్డారు. దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తోందని పేర్కొన్న ఆయన పింఛన్లు, రైతుబంధు పెంపుపై కసరత్తులు చేస్తున్నామని పేర్కొన్నారు.

 Minister Harish Rao slams bjp and congress to set up committees to get deposits:!!

బీఆర్ఎస్ మేనిఫెస్టో చూస్తే ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ కావాల్సిందేనని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఎవరేమన్నా తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచి తీరుతుందని, మూడోసారి అధికారంలోకి రాబోతున్నామని అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదని విజయం పై ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో మతకల్లోలాలు రేపిందని, మళ్లీ కల్లబొల్లి హామీలతో కాంగ్రెస్ ప్రజల ముందుకు వస్తుందని పేర్కొన్న ఆయన కాంగ్రెస్ ఒక భస్మాసుర హస్తం అంటూ మండిపడ్డారు .

ఇక బిజెపిని టార్గెట్ చేసిన మంత్రి హరీష్ రావు బిజెపి నడ్డా వచ్చాడని ఆయన తెలంగాణ కెసిఆర్ అడ్డా అని గుర్తు పెట్టుకోవాలంటూ పేర్కొన్నారు. మీ సొంత రాష్ట్రంలోనే బిజెపిని గెలిపించుకోలేని నడ్డా తెలంగాణలో బిజెపి ని ఎలా గెలిపిస్తారు అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి ఒక్క సీటు కూడా రాదని ఆయన పేర్కొన్నారు.

బిజెపి డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకోవాలని, బిజెపి వేసిన చేరికల కమిటీ అట్టర్ ఫ్లాప్ అయిందని ఇటీవల వేసిన ఎన్నికల కమిటీల పై మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. హంగు వస్తుందని బి ఎల్ సంతోష్ చెబుతున్నారని పేర్కొన్న ఆయన మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని హ్యాట్రిక్ కొడుతున్నాం అంటూ పేర్కొన్నారు.

హజీపూర్ మండలం పడ్తనపల్లిలో 85 కోట్లతో నిర్మించే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ తో మండలంలోని 10 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నదన్నారు. తెలంగాణ పథకాలు దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు, రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో ఉన్న పది అసెంబ్లీ స్థానాల్లో బిఅరెస్ విజయం సాధిస్తుందన్నారు...కాంగ్రెస్ హయాంలో నక్సలైట్ల ను నమ్మించి మోసం చేశారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+