
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్.!మనుగోడు నియోజక వర్గాన్ని భ్రష్టు పట్టించారని వ్యాఖ్య
నల్లగొండ/హైదరాబాద్ : మండలాల ఏర్పాటు సమయంలో మొట్టమొదటి సారిగా ప్రతిపాదించింది గట్టుప్పల్ మండలమేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేసారు. అటువంటి ప్రతిపాదనను చివరి నిమిషంలో నిలువరించిందే స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని ఆయన ఘాటుగా ఆరోపించారు. వాయిలపల్లి గ్రామస్తులతో అప్పటి నల్లగొండ జిల్లా కలెక్టర్ కు పిటిషన్ ఇప్పించి అడ్డుకున్నదే ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి అని మండిపడ్డారు.

మండల కేంద్రానికి మోకాలడ్డుపెట్టింది రాజగోపాల్ రెడ్డే.. మండిపడ్డ విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి
జిల్లాల
ప్రతిపాదన
తెర
మీదకు
వచ్చి
ముఖ్యమంత్రి
చంద్రశేఖర్
రావు
స్వయంగా
ఫోన్
చేసి
సూర్యాపేట
జిల్లా
ఏర్పాటు
అవుతుందని,
శుభాకాంక్షలు
అంటూ
చెప్పిన
మరుక్షణమే
అప్పటి
శాసనసభ్యుడిగా
ఉన్న
నియోజకవర్గ
టి
ఆర్
యస్
ఇంచార్జ్
కుసుకుంట్ల
ప్రభాకర్
రెడ్డికి
తానే
స్వయంగా
ఫోన్
చేసి
గట్టుప్పల్
మండల
ప్రతిపాదనను
ప్రస్తావించిన
అంశాన్ని
మంత్రి
జగదీష్
రెడ్డి
ప్రస్తావించారు.
అయితే
అనూహ్యంగా
కోమటిరెడ్డి
రాజగోపాల్
రెడ్డి
చివరి
నిమిషంలో
ఇక్కడి
వారితో
కలెక్టర్
కు
పిటిషన్
ఇవ్వడంతో
ఆగిపోయిందన్నారు.

ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారు... రాజగోపాల్ పగటి కలలు కంటున్నారన్న జగదీష్ రెడ్డి..
అటువంటి పరిస్థితులలో ఆగిపోయిన ప్రతిపాదన ప్రజల డిమాండ్ అంటూ నియోజకవర్గ ఇంచార్జ్ కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రస్తావించడం తాను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుక పోవడంతో గట్టుప్పల్ మండల కేంద్రంగా ఏర్పాటు అయిందన్నారు జగదీష్ రెడ్డి.సరిగ్గా నెల రోజుల క్రితం కళ్యాణాలక్ష్మి లబ్ధిదారులకు చెక్ లు పంపిణీ చేసేందుకు గాను గట్టుప్పల్ కు వచ్చినప్పుడు కుడా గట్టుప్పల్ మండల ఏర్పాటు ప్రజల ఆకాంక్ష అని, త్వరలోనే నెరవేరుతుందని చెప్పిన రీతిలోనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సహకారంతో మండలాన్ని ఏర్పాటు చేశామన్నారు.

సీఎం కు ధన్యవాద సభ.. స్థానిక నాయకులను అభినందించిన మంత్రి జగదీష్ రెడ్డి
అందుకు
ధన్యవాదాలు
తెలిపేందుకు
ముఖ్యమంత్రి
చంద్రశేఖర్
రావు
కు
కృతజ్ఞత
సభ
ఏర్పాటు
చేయడాన్ని
మంత్రి
జగదీష్
రెడ్డి
నిర్వాహకులను
అభినందించారు.
ఇంకా
ఈ
కార్యక్రమంలో
మాజీ
శాసనసభ్యులు
నియోజకవర్గ
టి
ఆర్
యస్
ఇంచార్జ్
కుసుకుంట్ల
ప్రభాకర్
రెడ్డి,జడ్
పి
టి
సి
కర్నాటి
వేంకటేశం,ఇడెం
కైలాసం
తదితరులు
పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి
చంద్రశేఖర్
రావు
చొరవను
సభలో
అందరూ
ప్రశంసిస్తుంటే
కాంగ్రెస్
ఎమ్మెల్యే
కోమటి
రెడ్డి
రాజగోపాల్
రెడ్డి
విమర్శించారని
మండిపడ్డారు.

సీఎం సంకల్పంతోనే మండల కేంద్రం ఏర్పాటు.. రాజగోపాల్ వి కుటిల రాజకీయాలన్న మంత్రి
మండలాల ఏర్పాటులో మొట్ట మొదటి ప్రతిపాదననే గట్టుప్పల్. గట్టుప్పల్ మండలఏర్పాటును అడ్డుకున్నదే కోమటిరెడ్డి అన్నారు. పిటిషన్ వేసి నిలువరించారని, చివరి నిమిషంలో ఆగిందన్నారు. ప్రజల డిమాండ్ ను ప్రభుత్వం అర్థం చేసుకుందని, ఇక్కడి ప్రజల కలల సాకారం చెయ్యాలి అన్నది ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంకల్పం అని జగదీష్ రెడ్డి గుర్తు చేసారు. నెల రోజుల కిందట గట్టుప్పల్ లొనే ప్రకటన చేశానని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆశీర్వాదం తోటే మండల ఏర్పాటు సాద్యపడిందన్నారు. ప్రజల వద్దకు పాలన సౌలబ్యత కోసమే ప్రభుత్వం కార్యక్రామాలు రూపొందిస్తుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.