బీజేపీ వల్లే దేశం దివాలా; సీఎం కేసీఆర్ నిప్పు.. ముట్టుకుంటే మటాషే: మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో గులాబీ పార్టీ నేతలు అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కు కితాబిస్తూ ప్రత్యర్థి పార్టీల నేతలను తిట్టిపోస్తున్నారు. ఇక తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలను విమర్శిస్తూనే కెసిఆర్ కు కితాబిచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పు లాంటి వ్యక్తి .. ముట్టుకుంటే భస్మం
సూర్యాపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా నియమితులైన బడుగుల లింగయ్య యాదవ్ అభినందన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ నేతలు పై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పు లాంటి వ్యక్తి అని ఆయనను ముట్టుకుంటే భస్మం అవుతారంటూ మంత్రి జగదీష్ రెడ్డి విరుచుకుపడ్డారు. కెసిఆర్ కాళేశ్వరం కల సాకారం చేసిన నేత అని, సంక్షేమం, అభివృద్ధి లో సంచలనాలు సృష్టించిన నాయకుడు అని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. పైరవీలు, దందాలు చేసే వాళ్ళే ఊరు కుక్కల మాదిరిగా మొరుగుతున్నారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి.

కెసిఆర్ మీద కేసీఆర్ కుటుంబం మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు
కెసిఆర్ మీద కేసీఆర్ కుటుంబం మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు అని మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ లేకుంటే నేడు రాష్ట్రంలో 24 గంటల విద్యుత్తు ఉండేదా అంటూ మంత్రి జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. 29 రాష్ట్రాలలో అతి చిన్న రాష్ట్రమైన తెలంగాణ, సంక్షేమంపై అభివృద్ధిలో పరుగులు పెడుతున్న రాష్ట్రం అని కొనియాడారు. ఇంటింటికి మంచినీటిని అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని జగదీష్ రెడ్డి కితాబిచ్చారు.

రాష్ట్రంలో బీజేపీ చేసిందేంటి
రాష్ట్రంలో బీజేపీ చేసిందేమిటో చెప్పాలని మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. దళారులకు దోచి పెట్టడం వారితో అంట కాగడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదని పేర్కొన్నారు. గుజరాత్లో దారిద్ర్యరేఖ మరింత పెరిగిందని, మోడీ పాలనలో దళారులు కుబేరులు అయ్యారని, దేశం దివాలా తీసిందని మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని నడిపే నాయకుడు ఎవరో వారికే తెలియదని మండిపడ్డారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు పేలుతున్న పిచ్చి ప్రేలాపనలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
Recommended Video

ఎక్కడైనా చర్చకు టిఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు
టీఆర్ఎస్ పాలన అంతా పారదర్శకంగా జరుగుతుందని, మేనిఫెస్టోలో ఉన్నదున్నట్టు అమలు చేస్తున్నామని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంలో ఎక్కడైనా చర్చకు టిఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 70 ఏళ్లుగా జరగని అభివృద్ధి ఏడేళ్ళుగా 75 శాతం పూర్తయిందని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. టిఆర్ఎస్ పార్టీ సంచలనాలకు కేంద్ర బిందువు అని, అలాంటి పార్టీలో సభ్యత్వం పొందడమే గౌరవమని ఆయన చెప్పుకొచ్చారు. నిబద్ధత పార్టీలో గుర్తింపు ఇస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. నిబద్ధతతోనే బడుగు, బలహీన వర్గాల నేతలకు పదవులు వచ్చాయని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు












Click it and Unblock the Notifications