వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Munugodu By Election: పథకాలన్నీ ఆగిపోతాయి.. జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

|
Google Oneindia TeluguNews

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి. ప్రధానంగా రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగ తీసుకుంది. దాదాపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు ఇక్కడే ఉండి ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్ అప్పడప్పుడు ప్రచారానికి వచ్చి వెళ్తున్నారు. మరో పక్క టీఆర్ఎస్ అధినేత త్వరలో ఇక్కడ ప్రచారం చేయనున్నారు. మంత్రులు మునుగోడ నియోజకవర్గాన్ని కలియదిరుగుతున్నారు.

మోటర్లకి మీటర్

మోటర్లకి మీటర్


ప్రచారంలో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు స్థానికంగా సంచలనం సృష్టించాయి. రాజగోపాల్ గెలిస్తే టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని జగదీశ్ రెడ్డి అన్నారు. మల్కాపూర్ లో ప్రచారం నిర్వహించిన జగదీశ్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. రైతుల మోటర్లకి మీటర్ పెడితే తప్పు ఏముందని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అంటున్నారని.. రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే టీఆర్ఎస్ ద్వారా వచ్చే పథకాలన్నీ ఆగిపోతాయని చెప్పారు.

రాజగోపాల్ రెడ్డి

రాజగోపాల్ రెడ్డి


అటు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తాను రాజీనామా చేయడం వల్లే రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు మునుగోడు చుట్టు తిరుగుతున్నారని చెప్పారు. బీజేపీని గెలిపిస్తే మునుగోడును మరింత అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు.

పాల్వాయి స్రవంతి

పాల్వాయి స్రవంతి


అటు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రచారం చేస్తున్నారు. తన తండ్రిని గుర్తు చేస్తూ ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఆమె మద్దతుగా పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆడ బిడ్డను గెలిపించాలని కోరుతున్నారు. బీఎస్పీ కూడా మునుగోడులో తీవ్రంగా ప్రచారం చేస్తోంది.

English summary
Parties increased their speed in the munugodu by-election campaign. Along with BJP, Congress and TRS, BSP is also campaigning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X