ప్రైవేట్ విమానం అందుకేనా?: కేసీఆర్‌పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సూర్యాపేటలో తాగేందుకు నీళ్లు లేక ఇక్కడి ప్రజలు మూసీ నీళ్లు తాగుతుంటే.. అవసరం లేకున్నా ఉత్తర తెలంగాణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందని మండిప్డారు. నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు.

కాళేశ్వరం కంటే ముందుగా ప్రారంభించిన డిండి ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని మంత్రి ప్రశ్నించారు. కమీషన్ల కోసం కట్టిన కాళేశ్వరం, మూడేళ్లకే కుంగిపోయిందని కోమటిరెడ్డి విమర్శించారు. ఏపీ సీఎం జగన్‌​తో కుమ్మక్కై దక్షిణ తెలంగాణను కేసీఆర్ నాశనం చేశారన్నారు. జిల్లాలో బీఆర్ఎస్ రూ.300 కోట్లు ఖర్చుపెట్టి ఒక్క సీటు మాత్రమే గెలిచిందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.

minister komatireddy venkat reddy sensational comments on kcr

తాము సూర్యాపేటలో ప్రచారం చేసి ఉంటే జగదీశ్‌ రెడ్డి ఓడిపోయేవారని వ్యాఖ్యానించారు మంత్రి కోమటిరెడ్డి. ఎస్‌ఎల్‌బీసీపై మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని మండిపడ్డారు. ఆయనకు ఎప్పుడూ ఎక్కడ దోచుకుందామా అనే ఆలోచనలే ఉంటాయని విమర్శించారు. యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌లో ఆయన వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు.

కీలక శాఖలన్నీ తన వద్దే పెట్టుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ దోపిడీకి పాల్పడ్డారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌ బాలకృష్ణనే కేసీఆర్ దోపిడీకి ఉదాహరణ. అతడు రూ. వందల కోట్ల అక్రమ సంపాదనతో దొరికాడు. మాజీ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు సైతం ఐదు వేల ఎకరాలున్నాయి. ఆయన బండారం త్వరలోనే బయటపడుతుంది అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అడ్డంగా దోచుకొని ఇప్పుడు పక్కదారి పట్టిస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ఇంకా ప్రైవేటు విమానం లీజ్‌ క్యాన్సిల్‌ చేసుకోలేదన్న మంత్రి కోమటిరెడ్డి.. దుబాయ్‌ పారిపోవచ్చనే లీజును కొనసాగిస్తున్నారేమోనని సంచలన వ్యాఖ్యానించారు. అన్ని విషయాలు అసెంబ్లీ సమావేశాల్లో బయట పడతాయని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి స్థానల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోస్యం చెప్పారు. బీఆర్​ఎస్‌​కు తెలంగాణలో భవిష్యత్‌ లేదన్నారు. కేసీఆర్, హారీశ్‌రావు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే నల్గొండకు రావాలని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+