భద్రకాళీ బంగారు బోనం వివాదంపై, సొంతపార్టీ నేతలపై మంత్రి కొండా సురేఖ ఘాటువ్యాఖ్యలు

భద్రకాళీ అమ్మవారికి ఈనెల 22వ తేదీన బంగారు బోనం సమర్పించనున్న నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ వర్సెస్ స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు అన్నచందంగా రాజకీయం మారింది. ఇక తాజాగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పైన, కడియం శ్రీహరి పైన చేసిన వ్యాఖ్యలు వారిలో తీవ్ర అసహనానికి కారణంగా మారాయి.

కొండా దంపతులపైన వరంగల్ జిల్లాలో వ్యతిరేకత
ఇక ఇప్పటికే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బసవరాజు సారయ్య కొండా సురేఖ వర్గానికి దూరంగా ఉంటున్నారు. తాజా పరిణామాలతో వీరంతా నాయిని రాజేందర్ రెడ్డి ఇంట్లో సమావేశాన్ని నిర్వహించారు. కొండా దంపతుల పైన వేటు వేయాలని అధిష్టానం వద్ద డిమాండ్ చేయాలని వారి వ్యవహార శైలి రోజు రోజుకి శృతిమించుతున్నదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేసినట్టు సమాచారం.

minister konda surekha shocking comments on mla nayini rajender reddy and kadiyam srihari bangaru bonam controversy

Take a Poll

తనపై కుట్రలు చేస్తున్నారని మండిపడిన కొండా సురేఖ
ఇదిలా ఉంటే తాజాగా మంత్రి కొండా సురేఖ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భద్రకాళి ఆలయంలో అమ్మవారికి బంగారు బోనం సమర్పించే వివాదాన్ని మొదలుపెట్టి తన మంత్రి పదవిని లక్ష్యంగా చేసుకొని వరంగల్ వేదికగా కొందరు కుట్రలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

భద్రకాళీ బంగారు బోనంపై రాజకీయం మంచిది కాదు
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పైన తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కొండా సురేఖ భద్రకాళి ఆలయం ఎవరి సొత్తు కాదని కొందరు అది తమదే అన్నట్టుగా భావిస్తున్నారు అంటూ విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలకు నాయిని రాజేందర్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆమె ఆరోపణలు గుప్పించారు. భద్రకాళి అమ్మవారికి ఆగమశాస్త్రం నిబంధనల ప్రకారమే బోనం సమర్పించాలని నిర్ణయించామని, అక్కడ జంతుబలులు ఇస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు.

బల్కంపేట ఆలయం నుండి బోనం భద్రకాళికి సమర్పణ
అమ్మవారు శాకాహారి అన్న విషయం అందరికీ తెలుసని పేర్కొన్న కొండా సురేఖ అక్కడ పనిచేస్తున్న అర్చకుల అభిప్రాయాల మేరకే బల్కంపేట దేవాలయం నుంచి బోనం తీసుకొచ్చి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తామని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైన ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె తాను మంత్రిగా పనిచేయడం చూసి కడియం నామోషీగా ఫీల్ అవుతున్నాడని, అందుకే తన మంత్రి పదవి పోతుందని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై తీవ్ర వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి వద్దకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరకు వెళ్లి నాపై లేనిపోనివి చెబుతున్నారని కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గోదావరి పుష్కరాల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను సమాన దృష్టితో చూడాలని కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. పుష్కరాల కోసం కేంద్రం 200 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరుతూ లేఖ రాశామని ఆమె పేర్కొన్నారు.

కేంద్ర మంత్రులను టార్గెట్ చేసిన కొండా సురేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తామని గోదావరి పుష్కరాల నిధుల విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలని, లేనిపక్షంలో వారిద్దరూ చేతగాని మంత్రులుగా మిగిలిపోతారు అంటూ కొండా సురేఖ కేంద్ర మంత్రులను సైతం విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+