కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సంగతి ఏమైంది... కేంద్రమంత్రి పీయుష్ గోయల్‌కు కేటీఆర్ ట్వీట్...
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ,సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదా.. ఇలా పునర్విభజన చట్టంలో పేర్కొన్న చాలా హామీలను కేంద్రం అటకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం రద్దు చేసింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని చెప్పింది. దీంతో రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువత పొట్ట కొట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. తాజాగా మంత్రి కేటీఆర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర రైల్వే మంత్రి పీయుష్ గోయల్‌కు ట్వీట్ చేశారు.
'ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీపై ఏమైనా అప్‌డేట్స్ ఉంటే చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 150 ఎకరాలు సేకరించి కేంద్రానికి ఇచ్చింది...' అని కేటీఆర్ ట్వీట్ చేశారు. మహారాష్ట్రలోని లాతూర్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రమంత్రి పీయుష్ గోయల్ ట్వీట్ చేయగా... దానిపై మంత్రి కేటీఆర్ ఇలా స్పందించారు. ఇతర రాష్ట్రాల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్న కేంద్రం... తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనేలా ఆయన ట్వీట్ చేశారు.

ఇటీవల సమాచార హక్కు చట్టం కింద సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు ఎప్పుడు ప్రారంభించనున్నారని కేంద్రాన్ని కోరగా... దేశంలో ప్రస్తుతానికి గానీ లేదా భవిష్యత్తులోగానీ ఎక్కడా రైల్వేశాఖకు కోచ్ ఫ్యాక్టరీల అవసరమే లేదని సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే.
రాజ్యసభలో కేంద్రమంత్రి పీయుష్ గోయల్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. 'రాష్ట్ర విభజన చట్టంలో కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని చేర్చిన వారు క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలను పరిశీలించారా...? ఏ రకంగా ఈ అంశాన్ని చేర్చారనేది వారినే అడగాలి. ప్రస్తుతం భారతీయ రైల్వే వద్ద అన్ని సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఎంతో కష్టపడి సంపాదించి పన్నుల రూపంలో వచ్చిన డబ్బును అవసరమున్న చోట వెచ్చించాలే తప్ప అనవసరంగా వృథా చేయొద్దు. కోచ్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలు ఇప్పుడు దేశంలో పూర్తిస్థాయిలో ఉన్నాయి.' అని తెలిపారు. ఈ ప్రకటనతో ఇక కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై కూడా ఆశలు వదిలేసుకోవాల్సిందేనా అన్న చర్చ జరుగుతోంది.
Dear Piyush Ji, Any updates on the Warangal Rail Coach Factory as promised to the people of Telangana in AP Reorganisation Act?
— KTR (@KTRTRS) March 22, 2021
FYI; The state Government has already handed over 150 Acres of land as directed by Government of India#WarangalRailCoachFactory https://t.co/dupU0B8ZiN
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications