హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఈవో కి గొడుగు పట్టిన కేటీఆర్- వండర్ ఫుల్ : సోషల్ మీడియాలో వైరల్ : ఫైర్ బ్రాండ్ సైతం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు. ఐటీ శాఖా మంత్రిగా ఆయన పలు ప్రముఖ సంస్థల అధినేతలు..సీఈఓలతో తరచూ సమావేశమవుతున్నారు. వారిని హైదరాబాద్ కు ఆహ్వానిస్తూ వారి సంస్థలను మరింతగా విస్తరించేందుకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా...తాజాగా జరిగిన ఒక ఘటన తో దేశ వ్యాప్తంగా ఇప్పుడు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు.

కేటీఆర్ సింప్లిసిటీకి ప్రముఖల ఫ్లాట్

కేటీఆర్ సింప్లిసిటీకి ప్రముఖల ఫ్లాట్

ఒక రోజు క్రితం ఐటీ పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ తరఫున బెంగాల్‌ ఎంపీ మహువా మెయిత్రా కేటీఆర్‌ను అభినందించగా తాజాగా ఇండస్ట్రియలిస్టు ఆనంద్‌ మహీంద్రా మంత్రి కేటీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా వినూత్న కార్యక్రమాలతో దూసుకుపోతున్న మంత్రి కేటీఆర్‌ ప్రతీ చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని..మరింతగా పారిశ్రామిక వేత్తలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా.. టెక్‌ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించారు.

టెక్ సీఈఓకు గొడుగు పట్టిన కేటీఆర్

టెక్ సీఈఓకు గొడుగు పట్టిన కేటీఆర్

నగరంలోని సెయింట్‌ థెరిస్సా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంటును ప్రారంభించడంతో పాటు ఏటూరునాగారం ఆస్పత్రికి అంబులెన్సును టెక్‌ మహీంద్రా తరఫున అందించారు. అయితే కార్యక్రమం జరుగుతుండగా ఒక్కసారిగా వర్షం మొదలైంది. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌ సీపీ గుర్నానీ తడవకుండా గొడుగు పట్టారు. దీంతో..కేటీఆర్ సింప్లిసిటీకి ఆయన ముగ్దుడయ్యారు. దీంతో.. మంత్రి కేటీఆర్‌ తనకు గొడుకు పట్టిన ఫోటోను ట్విట్టర్‌లో గుర్నానీ షేర్‌ చేశారు. 'మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో బాగుంది కేటీఆర్. మీరు మనస్ఫూర్తిగా వ్యవహరించిన విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. అసలు, మీ స్థాయి వ్యక్తి నాకు గొడుగు పట్టడం అనేది ఎంతో అరుదైన విషయం... ఇది ప్రతి రోజు జరిగే పని కాదు. అందుకు నా కృతజ్ఞతలు' అంటూ గుర్నానీ కామెంట్‌ చేశారు.

వండర్ ఫుల్ కేటీఆర్.. నాయకత్వం- వినయం

వండర్ ఫుల్ కేటీఆర్.. నాయకత్వం- వినయం

ఇక, దీనికి స్పందించిన టెక్‌ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ ట్వీట్‌కు ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. 'వండర్‌ఫుల్‌ కేటీఆర్‌. నాయకత్వం, వినయం అనేవి విడదీయరాని అంశాలను అనడానికి మీరొక అసాధారణమైన ఉదాహారణగా నిలిచారు' అంటూ కామెంట్‌ చేశారు. ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌కి మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కైండ్‌ వర్డ్స్‌ ఆనంద్‌మహీంద్రా జీ అంటూ నమస్కారం పెట్టే ఎమోజీని పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా జరిగిన మరో సమావేశంలోనూ కేటీఆర్ కు ప్రముఖ ఎంపీల నుంచి ప్రశంసలు అందాయి.

కేటీఆర్ కు ఫైర్ బ్రాండ్ ప్రశంసలు

స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లో ఏ‍ర్పాటు చేసిన తెలంగాణ హబ్‌ని పార్లమెంట్‌ ఐటీ స్టాండింగ్‌ కమిటీ ప్రశంసించింది. శశిథరూర్‌ నేతృత్వంలోని పార్లమెంటు ఐటీ స్టాండింగ్‌ కమిటీ ఇటీవల టీ ఐటీ హబ్‌ని సందర్శించారు. ఇక్కడ స్టార్టప్‌లకు అందుతున్న సౌకర్యాలు, ప్రభుత్వపరమైన ప్రోత్సహాకాలను వారు పరిశీలించారు. తెలంగాణ ఐటీ హబ్‌ పనితీరును పశ్చిమ బెంగాల్‌కి చెందిన టీఎంసీ ఎంపీ, ఫైర్‌బ్రాండ్‌ మహువా మెయిత్రా మెచ్చుకున్నారు. 70 వేల చదరపు అడుగుల ఇంక్యుబేటర్‌ సెంటర్‌ని త్వరలోనే 3.50 లక్షల అడుగుల చదరపు అడుగులకు విస్తరిస్తున్నారు.

Recommended Video

తీన్మార్ మల్లన్నపై ప్రభుత్వానికి కక్ష్య సాధింపు అన్న విద్యార్థి నాయకులు!!
తమిళనాడు ఇలాంటిది అవసరం అంటూ..

తమిళనాడు ఇలాంటిది అవసరం అంటూ..

ఒక ఐడియాతో తెలంగాణ ఐటీ హబ్‌లోకి వెళితే ప్రొడక్టుతో బయటకు రావొచ్చంటూ ఆమె ట్వీట్‌ చేశారు. అంతేకాదు వండర్‌ఫుల్‌ జాబ్‌ ఆల్‌ అరౌండ్‌ కేటీఆర్‌ అంటూ ప్రశంసించారు. మరోవైపు తమిళనాడుకు చెందిన కార్తి చిదంబరం సైతం ఐటీ హబ్‌ని మెచ్చుకున్నారు. ఇటువంటి ఐటీ హబ్‌ తమిళనాడుకు అవసరం ఉందంటూ ట్వీట్‌ చేశారు. టీ హబ్‌ ఈజ్‌ వెరీ ఇంప్రెసివ్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ ఇన్షియేటివ్‌ అంటూ ట్వీట్‌ చేశారు.

English summary
Minister KTR holds umberell for Tech Mahindra CEO Gurnani beame viral in social media. Anand mahinda praised ktr as phenomenal example. TMC and otehr MP's appreciated KTR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X