మాది ఢీ- టీమ్.. ఈ దేశానికి దొరికిన వజ్రాయుధం- కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్.. ఎన్నికల ప్రచార సమర శంఖాన్ని పూరించింది. పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఖమ్మం జిల్లా వేదికగా ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీనికి తెలంగాణ జన గర్జన అని పేరు పెట్టింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ దీనికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సభలో రాహుల్ గాంధీ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. లక్ష కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలను గుప్పించారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ ప్రాజెక్టుల్లో అడ్డగోలుగా దోచుకుందంటూ మండిపడ్డారు. భారత్ రాష్ట్ర సమితి అనేది బీజేపీ రిష్తేదార్ సమితి మారిందంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ అవినీతిలో బీజేపీకీ వాటా ఉందని ఆరోపించారు.

ఈ ఆరోపణలను మంత్రి కేటీఆర్ తిప్పి కొట్టారు. కాంగ్రెస్ భారత రాబందుల పార్టీ.. అంటూ విమర్శించారు. ఏఐసీసీ అంటే అఖిల భారత కరప్షన్ కమిటీ అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో అవినీతి, అసమర్థతకు ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్.. కాంగ్రెస్ అంటూ ధ్వజమెత్తారు. స్కాములే తాచుపాములై యూపీఏ, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను దిగమింగాయని కేటీఆర్ చెప్పారు.
తాము బీజేపీకి.. బీ టీమ్, కాంగ్రెస్‌కు సీ టీమ్ కాదని, ఈ రెండింటీనీ ఒంటిచేత్తో ఢీకొట్టే ఢీ- టీమ్ అని హెచ్చరించారు. బీఆర్ఎస్‌ను నేరుగా ఢీకొనే దమ్ములేక బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి తమను కాల్చే కుట్ర చేస్తారా? అంటూ నిలదీశారాయన. ఈ మిస్ ఫైరింగ్‌లో కాంగ్రెస్ కుప్పకూలుతుందని కేటీఆర్ అన్నారు. లక్ష కోట్ల వ్యయం కాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతా? అంటూ ప్రశ్నించారు.

అర్థంలేని ఆరోపణలు చేయడం వల్ల ప్రజాక్షేత్రంలో ఎన్నిసార్లు నవ్వులపాలవుతారని కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి చెప్పారు కేటీఆర్. భూములు, భూరికార్డుల చుట్టూ అల్లుకున్న సవాలక్ష చిక్కుముళ్లను విప్పిన ధరణిని ఎత్తివేసి.. మళ్లీ దళారుల రాజ్యాన్ని తీసుకొస్తామంటోన్న రాహుల్ గాంధీని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదని అన్నారు.
కర్ణాటకలో అన్నభాగ్య హామీని గంగలో కలిపారని, తెలంగాణలో 4,000 రూపాయల పింఛన్ ఇస్తామంటే నమ్మేదెవరని ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేషన్ ఇవ్వలేనోళ్లు.. ఇక్కడికొచ్చి డిక్లరేషన్ అంటే విశ్వసించేదెవరని అన్నారు. కర్ణాటకలో బీజేపీని ఓడించింది అక్కడి ప్రజలు తప్ప- ముమ్మాటికీ కాంగ్రెస్ కానే కాదని తేల్చి చెప్పారు.

మరో ప్రత్యామ్నాయం లేకే కర్ణాటక ఫలితం కాంగ్రెస్‌కు సానుకూలంగా వచ్చిందే తప్ప అది ఆ పార్టీ ఘనత, సమర్థత కాదని చెప్పారు. సమ్మక్క జాతరను తలపించేలా, పండగలా సాగుతున్న పోడుభూముల పంపిణీ రాహుల్ గాంధీకి కనిపించట్లేదా అని నిలదీశారు. కంటివెలుగు కింద పరీక్షలు చేయించుకోవాలని చురకలు అంటించారు.
కారు స్టీరింగ్ కేసీఆర్ చేతిలో పదిలంగా ఉందని, కాంగ్రెస్ పార్టీపై రాహుల్‌కు కంట్రోల్ తప్పిందని కేటీఆర్ అన్నారు. బంగాళాఖాతంలో ఆల్రెడీ నిండా మునిగిన పార్టీ కాంగ్రెస్ కాగా.. ప్రజల గుండెల నిండా అభిమానాన్ని పొందిన పార్టీ బీఆర్ఎస్ అంటూ చెప్పుకొచ్చారు. వజ్రోత్సవాలు జరుపుకొంటోన్న వేళ- దేశానికి దొరికిన వజ్రాయుధం.. బీఆర్ఎస్ అని చెప్పారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications