చాంద్రాయణ గుట్ట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా వేసిన మంత్రి కేటీఆర్.. రీజన్ ఇదే

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నగరంలో చెలరేగిన నిరసనల కారణంగా, మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఇంటి పై జరిగిన దాడికి కొనసాగింపుగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈరోజు ప్రారంభోత్సవం జరగాల్సిన చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ఆగస్ట్ 27వ తేదీకి వాయిదా పడింది. మంత్రి కేటీఆర్ స్వయంగా తన పర్యటనను వాయిదా వేశారు.

 చాంద్రాయణ గుట్ట ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం వాయిదా

చాంద్రాయణ గుట్ట ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం వాయిదా

బిజెపి నేతల అరెస్టులు, ఆందోళనల నేపథ్యంలో బిజెపి నేతలు చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ఓపెనింగ్ ను అడ్డుకుంటారు అన్న సమాచారంతో ప్రస్తుతానికి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసి ఆగస్టు 27వ తేదీన ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్-ఈ-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో పాటు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు, ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీలు చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌ను మంగళవారం ప్రారంభించాలని ముందుగా నిర్ణయించారు. కానీ అనుకోని పరిణామాలతో ప్రారంభోత్సవం వాయిదా పడింది.

 రాష్ట్రంలో బీజేపీ నేతల అరెస్ట్ లు, ఆందోళనలతో నిర్ణయం

రాష్ట్రంలో బీజేపీ నేతల అరెస్ట్ లు, ఆందోళనలతో నిర్ణయం


రాష్ట్రంలో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో, ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వాయిదా వేసుకున్న చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రాజెక్టు మొత్తం వ్యయం 30.79 కోట్లు కాగా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ కింద ఫ్లైఓవర్ పొడవును 500 మీటర్లు పెంచారు. ఆరామ్‌గఢ్ నుండి సంతోష్‌నగర్ మరియు ఎల్‌బి నగర్‌లను కలుపుతూ హైదరాబాద్ లోపలి రింగ్‌లో ఫ్లైఓవర్ ఉంది. ఇది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఎల్‌బి నగర్ మీదుగా నల్గొండ మరియు వరంగల్‌లకు సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది.

 కరోనా కారణంగా నిర్మాణం ఆలస్యం అయిన చాంద్రాయణ గుట్ట ఫ్లైఓవర్

కరోనా కారణంగా నిర్మాణం ఆలస్యం అయిన చాంద్రాయణ గుట్ట ఫ్లైఓవర్


కందికల్ గేట్ మరియు బార్కాస్ జంక్షన్‌ల వద్ద ఆగకుండా ట్రాఫిక్ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ మీదుగా నేరుగా వెళ్లవచ్చు. చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌కు జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ 2018లో ఆమోదం తెలిపి ఏడాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే, కరోనా మహమ్మారి లాక్‌డౌన్ కారణంగా ఇది ఆలస్యమైంది. ఇక ప్రస్తుతం ఈ ఫ్లై ఓవర్ ను ప్రారంభించాలని భావించిన, రాష్ట్రంలోని పరిణామాల నేపథ్యంలో వాయిదా పడింది. మళ్ళీ దీనిని ఆగస్ట్ 27న ప్రారంభించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+