వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

KTR: స్కూల్ వ్యానును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. కలెక్టర్‍కు కేటీఆర్ ఫోన్..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.

|
Google Oneindia TeluguNews

మంగళవారం ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగ‌ళ‌వారం ఉద‌యం ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బ‌స్సు ఢీ కొట్టింది. ఆర్టీసీ బస్సు స్కూల్ బస్సును వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో స్కూల్ వ్యాన్ లో ఉన్న పిల్లలు గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే పిల్లలను స్కూల్ వ్యాన్ నుంచి బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనలో 15 విద్యార్థులు గాయపడినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న కలెక్టర్ డీఈఓకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. క‌రీంన‌గ‌ర్ డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు, విజ్ఞాన్ స్కూల్‌కు చెందిన బ‌స్సును వెనుక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదం స‌మ‌యంలో బ‌స్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు.

Minister KTR responded to the road accident in Rajanna Sirisilla district on Tuesday morning

బ‌స్సు వేగంగా ఢీ కొట్ట‌డంతో స్కూల్ బ‌స్సులోని పిల్ల‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. పిల్ల‌ల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
ఈ విషయమై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో కేటీఆర్ ఫోన్ లో మాట్లాడారు. గాయపడిన విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమయితే హైద‌రాబాద్‌కు తరలించాలని సూచించారు.

English summary
A road accident took place in Rajanna Sirisilla district on Tuesday morning. An RTC bus hit a private school bus in Ellareddypet mandal center on Tuesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X