హైదరాబాద్ మెట్రో భారీ విస్తరణ: మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు, 48 గంటల్లోనే

హైదరాబాద్‌: మెట్రో రైలును భారీగా విస్తరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వేగంగా పనులు చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్, ఎయిర్ పోర్టు మెట్రో వ్యవస్థపైన మంత్రి కేటీఆర్ మెట్రో రైల్ భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, జీహెచ్‌సీఎం పరిధిలోని జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మెట్రో విస్తరణపై అధికారులతో చర్చించారు. ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రత్యేకంగా చర్చించారు. ఇందుకు అవసరమైన 48 ఎకరాల భూమిని మెట్రో డిపో కోసం అప్పగించాలని జీఎంఆర్ అధికారులను మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ భవిష్యత్ కోసం భారీగా మెట్రో విస్తరణ అవసరమని.. నగరంలో రద్దీ కాలుష్యం తగ్గేలా మెట్రో విస్తరణ చేస్తామన్నారు.

minister ktr review on hyderabad metro master plan at metro rail bhavan

మెట్రో రైల్ విస్తరించే కార్యక్రమాల ప్రణాళికలను సిద్ధం చేస్తూనే.. ప్రస్తుతం మెట్రో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కారిడార్లలో మరిన్ని అదనపు కోచ్‌లని పెంచాలని కేటీఆర్ సూచించారు. మెట్రో లాస్ట్ మైల్ కనెక్టివిటీపైన దృష్టి సారించి మరిన్ని ఫీడర్ సర్వీసులను ప్రారంభిస్తే మెట్రో సామర్థ్యాన్ని రెట్టింపు చేసే అవకాశాలున్నాయన్నారు. కాగా, ఇప్పటికే రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర విస్తరించనున్న మెట్రోకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు.

టెండర్‌ ప్రక్రియ కూడా తుదిదశకు చేరుకుంది. దీంతోపాటు జూబ్లీ బస్టాండ్‌ నుంచి తూంకుంట వరకు డబుల్‌ డెక్కర్‌ మెట్రో (ఒక లెవల్‌లో వాహనాలు, మరో లెవల్‌లో మెట్రో) ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ప్యాట్నీ నుంచి కండ్లకోయ ఓఆర్‌ఆర్‌ వరకు మరో రూట్‌లో (ఆదిలాబాద్‌ -నాగపూర్‌ రూట్‌లో) డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మించాలని నిర్ణయించింది. దీనికి సంబందించి రక్షణశాఖకు సంబంధించిన కంటోన్మెంట్‌ భూములు కొన్ని ఉన్నాయి.

హైదరాబాద్‌లో అతిముఖ్యమైన మరో మార్గం ఇస్నాపూర్‌ నుంచి మియాపూర్‌ వరకు, మియాపూర్‌ నుంచి లక్డీకపూల్‌ వరకు, విజయవాడ దారిలో ఎల్బీనగర్‌ నుంచి పెద్దఅంబర్‌పేట వరకు, వరంగల్‌ రూట్‌లో ఉప్పల్‌ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ వరకు మెట్రోను విస్తరింపజేయనుంది.

మహబూబ్‌నగర్‌ రూట్‌లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌వైపు నిర్మిస్తున్న మెట్రోను భవిష్యత్తులో కొత్తూరు మీదుగా షాద్‌నగర్‌ వరకు, తార్నాక నుంచి ఈసీఐఎల్‌ క్రాస్‌రోడ్‌ వరకు విస్తరించనున్నారు. ఇక, పాతబస్తీ మెట్రోను కూడా సమగ్రంగా విస్తరించనున్నారు. ఓఆర్‌ఆర్‌ ఉన్న 159 కిలోమీటర్లు చుట్టూ మెట్రోను విస్తరించబోతున్నారు. అదేవిధంగా ఎయిర్‌పోర్టు నుంచి ఫార్మాసిటీ అందుబాటులోకి రాబోతున్న కందుకూరు వరకు మెట్రోను నిర్మించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+