యాదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి, పర్యాటక ప్రాంతంగా సిరిసిల్ల

దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు.

రాజన్నసిరిసిల్ల: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు. మంగళవారం వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు, సంబంధిత అధికారులతో కలిసి మంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో వేములవాడ ఆలయాన్ని యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి పుణ్యక్షేత్రం తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మహా శివరాత్రికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలన్నారు.

minister KTR review on Vemulawada temple development and sircilla

వేములవాడ జాతరకు సౌకర్యాలు కల్పించేందుకు అదనపు నిధులు కేటాయిస్తామన్నారు మంత్రి కేటీఆర్. జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలన్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు కేటీఆర్ సూచించారు.

వేములవాడ గుడి చెరువును వరంగల్ బండ్ తరహాలో నిర్మించనున్నట్లు తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు భవిష్యత్తులో పర్యటక ప్రాంతాలకు మారుపేరుగా నిలవనున్నాయని చెప్పారు. ఆ దిశగా వాటిని అభివృద్ధి చేసే ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆదేశించారు. సిరిసిల్ల శివారులోని రామప్ప గుట్టపై అతి ఎత్తైన శివుని విగ్రహం, కాటేజీల నిర్మాణం, అడ్వెంచర్ గేమ్స్, వేములవాడ శివారులోని నాంపల్లి గుట్టపై కేబుల్ కార్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+