వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి ఆస్కార్ కాకున్నా భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే.. ఆ వీడియోతో మంత్రి కేటీఆర్ సెటైర్లు

|
Google Oneindia TeluguNews

ఏ చిన్న అవకాశం దొరికినా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించే మంత్రి కేటీఆర్ తాజాగా మరోమారు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ పై విరుచుకుపడ్డారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పై, గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుపై, రూపాయి విలువ పతనంపై ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర ప్రభుత్వ విధానాలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న మంత్రి కేటీఆర్ తాజాగా మరోమారు ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు.

ప్రధాని మోడీకి భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే

నోబెల్ బహుమతి కంటే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బహుమతికి విష గురూ అర్హుడని భావించే బిజెపి నాయకులు అందరికీ రూపాయి విలువ తగ్గింపుపై అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడంలో అద్భుతమైన చారిత్రాత్మకమైన థియేటర్ స్కిల్స్ కోసం తాను 2013 నాటి మోడీని నామినేట్ చేయాలనుకుంటున్నాను. అంటూ నాటి వీడియోను పోస్ట్ చేసి ప్రధాని నరేంద్ర మోడీ ని టార్గెట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి, నాటి ప్రభుత్వం పై ఆయన చేసిన వ్యాఖ్యలకు, ఆయన చూపించిన కళలకు ఆస్కార్ కాకపోయినా భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే అంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.

మోడీ నోబెల్ బహుమతికి అర్హుడు .. కానీ ఏ కేటగిరీలో అంటే

అంతేకాదు దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో మోదీకి నోబెల్ బహుమతి ఎందుకు ఇవ్వకూడదు అంటూ ఎద్దేవా చేశారు. మోడీ నోబెల్ బహుమతికి అర్హుడు... కానీ ఏ కేటగిరీలో అంటూ ఆసక్తికర ప్రశ్న వేశారు. కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టినందుకు వైద్యానికి నోబెల్ ఇవ్వకూడదా? పెద్ద నోట్ల రద్దు చేసి, స్విస్ బ్యాంకుల్లో దాచిపెట్టుకున్న బ్లాక్ మనీని ఇండియాకు రిటర్న్ తతెప్పించినందుకు ఆయనకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇవ్వకూడదా? రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆరుగంటలపాటు ఆపినందుకు ఆయనకు శాంతి నోబెల్ బహుమతి ఇవ్వకూడదా? ఇక రాడార్ సిద్ధాంతం కోసం మోడీకి భౌతిక శాస్త్రానికి నోబెల్ బహుమతి ఇవ్వకూడదా అంటూ సెటైర్లు వేశారు.

మోడీపై మంత్రి కేటీఆర్ సెటైర్లు

మోడీపై మంత్రి కేటీఆర్ సెటైర్లు


గత కొంతకాలం నుంచి కేంద్ర ప్రభుత్వ తీరును, ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే కీలక నిర్ణయాలను టార్గెట్ చేస్తూ తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్న మంత్రి కేటీఆర్ తాజాగా, మోడీకి ఆస్కార్ అవార్డు కాకపోయినా భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ దేశ పాలనలో ఏమీ చెయ్యలేకపోతున్నారని, మోడీ పాలనలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా మంత్రి కేటీఆర్ కేంద్రంలోని అధికార బీజేపీ ని టార్గెట్ చేసి పేద మధ్యతరగతి మహిళలవంటింట్లో నుంచే బీజేపీ పతనం షురూఅవుతుందని తేల్చి చెప్పారు.

గతంలో గ్యాస్ సిలెండర్ల ధరల పెంపుపైనా మోడీని టార్గెట్ చేసిన కేటీఆర్

గతంలో గ్యాస్ సిలెండర్ల ధరల పెంపుపైనా మోడీని టార్గెట్ చేసిన కేటీఆర్

గ్యాస్ సబ్సిడీని ఎత్తివేస్తారు, కంపెనీలకు ప్యాకేజీలు ఎత్తిపోస్తారా? అంటూ ప్రశ్నించారు. రూ.400 ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.1100 అయినా ఇంకా పెరుగుతూనే ఉందన్నారు. ఆయిల్ కంపెనీలకు ఆర్థిక సహాయం చేస్తూ, ఆడపిల్లలపై పెను భారం మోపుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. గ్యాస్ ధర వెయ్యి అయ్యింది, పేదలకు మళ్లీ కట్టెలపొయ్యి దిక్కయ్యింది అంటూ కేంద్ర ప్రభుత్వ తీరును టార్గెట్ చేసిన కేటీఆర్ పేదవాడి పొట్ట కొట్టడం, మళ్లీ వాళ్ల చేతిలో పొగగొట్టం పెట్టడమే అంటూ నిప్పులు చెరిగారు. మోయలేని భారం మోపేవాడే మోడీ అంటూ టార్గెట్ చేశారు.

English summary
Minister KTR satires on Modi that he should be given the Bhaskar Award instead of the oscar award. With the video of 2013, Minister KTR made a satire by recalling the comments made by Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X