Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేటీఆర్ చేతుల మీదుగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం... ఎప్పుడంటే...

హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న సాయంత్రం 5గంటలకు మంత్రి కేటీఆర్ ఈ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. కొద్దిరోజుల క్రితమే దీని పనులు పూర్తయ్యాయి. దాదాపు రూ.184కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45-ఐటీ కారిడార్‌ను అనుసంధానం చేయనుంది. దీని పొడవు 754.38మీ. కాగా.. వెడల్పు ఆరు లేన్లు ఉంటుంది.

పాదాచారులు,సైకిలిస్టుల కోసం బ్రిడ్జిపై ప్రత్యేక ట్రాక్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైటింగ్ రాత్రి సమయంలో బ్రిడ్జి అందాలను రెట్టింపు చేయనుంది. ఈ బ్రిడ్జిపై రాకపోకలను ప్రారంభించనప్పటికీ... ఇప్పటికీ ఎంతోమంది సందర్శకులు ప్రతీరోజూ ఇక్కడికి వచ్చిపోతున్నారు. రాత్రిపూట జిగేల్ కాంతుల నడుమ బ్రిడ్జి పైనుంచి చెరువు అందాలను వీక్షిస్తూ మైమరిచిపోతున్నారు. ఒకరకంగా నగరంలో ఇది కూడా ఓ టూరిస్ట్ స్పాట్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇక్కడ బోటింగ్, రెస్టారెంట్లను కూడా ఏర్పాటు చేసే యోచనలో టూరిజం శాఖ ఉన్నది.

minister ktr to be inaugurate durgam cheruvu cable bridge on sep 19th

ఒకప్పుడు కుతుబ్ షాహీల పాలనలో గోల్కొండ నవాబులకు మంచి నీరందంచిన చరిత్ర దుర్గం చెరువుకు ఉన్నది. దాదాపు 83 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువు దేశంలోని రహస్య తటాకాల్లో ఒకటిగా చరిత్రలో నిలిచింది. దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే మాదాపూర్-జూబ్లీహిల్స్ మధ్య దూరం తగ్గనుంది. వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తప్పనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+