వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ లవంగం గారిని ఇలాగే వదిలెయ్యకండి - కేటీఆర్...!!

|
Google Oneindia TeluguNews

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన సంచలన ఆరోపణలు చేసారు. దీని పైన కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. బండి సంజయ్ చేసిన ఆరోపణల వీడియోను జత చేస్తూ..బీజేపీ నేతలకు సూచనలు చేసారు. బండి సంజయ్ ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకొని సీఎం తన ఫాంహౌస్‌లో క్షుద్రపూజలు చేస్తున్నారని, ప్రతి మూడు నెలలకోసారి నల్లపిల్లితో ఈ పూజలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఆ ప్రాంతంలో ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందారని, ఆ కేసులను ఇప్పటికీ బయటికి రానివ్వలేదని అన్నారు. ఒక తాంత్రికుడి సలహాల మేరకే కేసీఆర్‌ పనిచేస్తున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎ్‌సగా మార్చడం, ఏడేళ్లుగా సచివాలయాలయానికి వెళ్లకపోవడం, ఉన్న భవనాన్ని కూల్చివేయడం వంటివన్నీ ఆ తాంత్రికుడి సలహాల మేరకే చేశారని చెప్పుకొచ్చారు.

దీని పైన స్పందించిన కేటీఆర్..తన ట్వీట్ లో ఈ లవంగం గారిని ఇలాగే వదిలెయ్యకండి రా బీజేపీ బాబులు. పిచ్చి ముదిరి తొందర్లో కరవడం మొదలు పెడతాడేమో; మతి లేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడు. ఎర్రగడ్డలో బెడ్ తయారుగ ఉంది. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి..అంటూ ట్వీట్ చేసారు.

Minister KTR Tweet on Bandi Sanjay Comments against CM KCR

కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేసారు. మంత్ర, తంత్రగాళ్లు ఇచ్చిన సలహా వల్లే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్‌ రాష్ట్ర సమితి గా మార్చారని వ్యాఖ్యానించారు. మంత్ర, తంత్రాలు చేేసవారు సచివాలయానికి వెళ్లొద్దని, మంచి జరగదని కేసీఆర్‌కు చెప్పడంవల్లే ఆయన వెళ్లడం లేదన్నారు. వాస్తు సరిగ్గా లేదని బాగున్న సచివాలయాన్ని కూల్చి కొత్త భవనం నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తారంటూ ఒకే తరహా వాయిస్ వినిపిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి ఇదే రకమైన వ్యాఖ్యలు చేయటంతో టీఆర్ఎస్ నేతలు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి

English summary
Minister KTR tweet on BJP state Chief Bandi Sanjay against his comments on KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X