నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలకు వెనుకాడం.. బండి సంజయ్ కు కేటీఆర్ వార్నింగ్!!

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో గ్రామ గ్రామాన ప్రజలతో మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోయిన అవినీతిని, ప్రజా సమస్యల పరిష్కారంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైన తీరును, కెసిఆర్ కుటుంబ పాలనను ప్రజాక్షేత్రంలో తూర్పార బడుతున్నారు. ఏ మాత్రం అవకాశం దొరికినా తెలంగాణ సీఎం కేసీఆర్ ను, మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇంటర్మీడియట్ విద్యార్థులు మృతికి కేటీఆర్ కారణమన్న బండి సంజయ్

ఇంటర్మీడియట్ విద్యార్థులు మృతికి కేటీఆర్ కారణమన్న బండి సంజయ్

ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా ప్రజా సంగ్రామ యాత్రలో మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసిన మంత్రి కేటీఆర్ ఆ వీడియోలో బండి సంజయ్ మంత్రి కేటీఆర్ నిర్వాకం వల్ల రాష్ట్రంలో 27 మంది ఇంటర్మీడియేట్ విద్యార్థులు మరణిస్తే కనీసం స్పందించని దౌర్భాగ్యం ముఖ్య మంత్రి కెసిఆర్ అంటూ ఇంటర్మీడియట్ విద్యార్థి మృతిచెందిన ఒక ఘటనను కళ్లకు కట్టినట్లు చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను, మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చూసి ఇంటర్మీడియట్ విద్యార్థుల మృతికి వారే కారణం అంటూ విరుచుకుపడ్డారు.

నిరాధారమైన ఆరోపణలు ఆపకుంటే చట్టపరమైన చర్య తీసుకుంటాం

బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పై మండిపడిన మంత్రి కేటీఆర్ బండి సంజయ్ కుమార్ మీరు ఈ హాస్యాస్పదమైన, నిరాధారమైన, బాధ్యతారహితమైన ఆరోపణలు ఆపకపోతే, నేను చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. అంతేకాదు మీరు ఆరోపించిన దాన్ని రుజువు చేయడానికి మీ వద్ద ఏదైనా సాక్ష్యం ఉంటే దానిని ప్రజల ముందు పెట్టండి, లేదా మీరు చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పండి అంటూ బండి సంజయ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

బండి సంజయ్ తో మహిళ మాట్లాడిన వీడియో షేర్ చేసిన కేటీఆర్

ఇక ఇదే సమయంలో బండి సంజయ్ తో ఓ మహిళ ప్రజాసంకల్పయాత్ర లో చేసిన వ్యాఖ్యల వీడియోను షేర్ చేసిన మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ పాలన ఎలా ఉందో బండి సంజయ్ కు ఆ మహిళ చెప్పిందని వెల్లడించారు. నా భర్తకు బిజెపి అంటే ప్రాణం, నా భర్త చనిపోయినప్పుడు బిజెపి నాయకులు ఎవరూ మా కుటుంబాన్ని ఓదార్చలేదు,సహాయం చేయలేదు..కాని కెసిఆర్ రూ.5 లక్షల రైతుబీమాతో మాకు సహాయం చేశారు అని బండి పాదయాత్రలో ఒక మహిళ చెప్పినట్టుగా ఉన్న వీడియోను పోస్ట్ చేశారు మంత్రి కేటీఆర్.

రైతు భీమా పథకం బీజేపీ కార్యకర్తలకు అందిందని మహిళ చెప్పిందన్న మంత్రి

రైతు భీమా పథకం బీజేపీ కార్యకర్తలకు అందిందని మహిళ చెప్పిందన్న మంత్రి

రాజకీయాలకు అతీతంగా బలహీనులందరికీ సంక్షేమమే కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రైతు భీమా పథకం గురించి ఒక మహిళ బిజెపి నాయకులతో చెప్పినట్లు బిజెపి కార్యకర్తల కుటుంబాలకు కూడా ₹5 లక్షలు చెల్లించబడింది .40 లక్షల మంది రైతులకు మద్దతు ఇచ్చే ప్రభుత్వం మొత్తం ప్రీమియం చెల్లించే రైతు బీమాతో బిజెపి కార్యకర్తలకు లబ్ధి జరిగిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు మంత్రి కేటీఆర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+