డ్రైవర్ భార్యకు మంత్రి ఓదార్పు (పిక్చర్స్)
హైదరాబాద్: సికింద్రాబాదులోని బోయిన్‌పల్లిలో మంటల్లో చిక్కుకున్న సంఘటనా స్థలాన్ని తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డి సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి పోలీసులు, ఆర్టీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత డ్రైవర్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచందర్‌రావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆర్టీసీ బస్సు ఎక్కడి నుంచి ఎప్పుడు బయల్దేరింది, బస్సులో ఎంతమంది ప్రయాణికులున్నారు. క్షతగాత్రుల పరిస్థితి తదితర విషయాలను అక్కడే ఉన్న ఆర్టీసీ అధికారులు, పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరగడం దురదృష్టకరమని మీడియాతో అన్నారు.
సంఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతారని, తాము కూడా విచారణ జరిపి కారణాలు తెలుసుకుంటామని వెల్లడించారు. ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు.

డ్రైవర్ భార్యను ఓదార్చిన మంత్రి
బస్సు ప్రమాదంలో మరణించిన భార్యను తెలంగాణ రవాణా శాఖ మంత్రి గంగాధర్ భార్యను పరామర్శించారు.

కలచివేస్తోందని మంత్రి..
బస్సు డ్రైవర్ సజీవ దహనం కావడం కలచివేస్తుందని మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.

కుటుంబానికి నష్టపరిహారం
మృతుని కుటుంబానికి 6 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తామని, కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.

ప్రమాదంపై విచారణ
ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపిస్తామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మీడియాతో అన్నారు.

సంఘటనా స్థలంలో మంత్రి
ప్రమాదం జరిగిన స్థలాన్ని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సంర్శించారు. ప్రమాదంపై పోలీసులను, ఆర్టీసి అధికారులను అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications