Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ ప్రత్యేక హోదా, పోలవరంపై మంత్రి మల్లారెడ్డి సంచలనం; పోటీపైనా మల్లారెడ్డి వ్యాఖ్యల కలకలం!!

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఏపీ రాజకీయాల పైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పోటీ చేయడం పైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా పైన, పోలవరం ప్రాజెక్టు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 ఏపీ ప్రత్యేక హోదాపై మంత్రి మల్లారెడ్డి సంచలనం

ఏపీ ప్రత్యేక హోదాపై మంత్రి మల్లారెడ్డి సంచలనం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ఇప్పటికే అనేక మార్లు రాజకీయ పార్టీలు రకరకాల ప్రకటనలు చేసి, రాజకీయ అస్త్రంగా ప్రత్యేక హోదాను ఉపయోగించుకుంటున్న వేళ మంత్రి మల్లారెడ్డి కూడా ప్రత్యేక హోదా అంశాన్ని, ఏపీలో పరిస్థితులను, బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేయడం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పోలవరం పూర్తి కాలేదని, ఇప్పటి వరకు ప్రత్యేక హోదా సాధించలేదని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ను గెలిపిస్తే కాళేశ్వరం తరహాలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే దమ్ము ధైర్యం కేసీఆర్ కే ఉన్నాయి

పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే దమ్ము ధైర్యం కేసీఆర్ కే ఉన్నాయి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్ళు అవుతున్నా ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని, విభజనలో రకరకాల హామీలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా మాటను మరిచిపోయిందని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తే విభజనలో ఇచ్చిన హామీలు అన్నింటినీ కేసీఆర్ పూర్తి చేస్తారని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దమ్ము ధైర్యం ఒక్క కేసీఆర్ కు మాత్రమే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ కాలినడకన తిరుమలకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నానని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.

 2024 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ 175 నియోజకవర్గాలలో బరిలో ఉంటుంది

2024 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ 175 నియోజకవర్గాలలో బరిలో ఉంటుంది


సీఎం కేసీఆర్ ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా బి ఆర్ ఎస్ పార్టీ కి మంచి స్పందన లభిస్తోందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. 2024 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి 175 నియోజకవర్గాలలో పోటీ చేయడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఏపీలో విజయం సాధించడం కూడా ఖాయమన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2024 సంవత్సరంలో దేశవ్యాప్తంగా పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు.

 ఏపీతో పాటు ఆ రాష్ట్రాల నుండి మంచి ఆదరణ వస్తుంది

ఏపీతో పాటు ఆ రాష్ట్రాల నుండి మంచి ఆదరణ వస్తుంది


బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, విశ్లేషకులు ఆలోచనలో పడ్డారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు చేయడం లేదని పేర్కొన్న మంత్రి మల్లారెడ్డి కెసిఆర్ అందుకే టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారు అన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర లలో మంచి ఆదరణ వస్తుందని పేర్కొన్నారు. ఆయన త్వరలో వివిధ రాష్ట్రాలలో బహిరంగ సభ ను పెట్టడానికి కెసిఆర్ సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు.

మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలతో ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ

మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలతో ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ


ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ విస్తరణపై తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టిసారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన పలువురు నేతలు నేడు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని సమాచారం. ఇందులో తోట చంద్రశేఖర్ తో పాటు పలువురు ఏపీ నేతలు బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో మంత్రి మల్లారెడ్డి ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేకెత్తించేలా 175 స్థానాల్లో పోటీ చేస్తామని, అధికారం కట్టబెడితే కాళేశ్వరం తరహాలో పోలవరాన్ని పూర్తి చేస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+