నా పరిపాలనలో మాటలుండవు.. కనుసైగలే: వార్నింగ్ ఇచ్చిన మంత్రి

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారు పాలనలో దూకుడును కొనసాగిస్తున్నారు. తాజాగా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు అధికారులకు ఆసక్తికర హెచ్చరికను జారీ చేశారు. పాలేరు లోని కూసుమంచి మండలం లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

రాష్ట్రంలో ఎక్కడ ఎలా జరిగినా పాలేరు లో మాత్రం లంచం తీసుకుని పోస్టింగ్ ఇవ్వడం జరగదని ఆయన స్పష్టం చేశారు. అలాగే అధికారులు కూడా ఎక్కడ రూపాయి ఆశించకుండా పనులను చేయాలని పేర్కొన్నారు. ఏ అధికారిని ట్రాన్స్ఫర్ చేయడం జరగదని చెప్పిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరికి వారు పద్ధతి మార్చుకొని విధులు నిర్వహించాలని సూచించారు.

Minister Ponguleti Srinivas Reddy shocking warning to officials

ఒకవేళ అలా మారకపోతే కంటి సైగలతోనే వారంతట వారే వెళ్ళిపోయే విధంగా చేస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పరిపాలనలో మాటలు ఉండవు అన్నీ కనుసైగలే అని పేర్కొన్న ఆయన, అధికారులు తన జ్ఞానేంద్రియాలు అని, వారు సక్రమంగా పనిన్ చేస్తే తనకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, అలా కాకుంటే మాత్రం ఇబ్బంది పడాల్సింది వారంటూ స్పష్టం చేశారు.

ఎవరెన్ని కుట్రలు చేసినా అందరి దీవెనలతో గెలిచానని, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ లను 100 రోజుల్లో పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రుల ఆధ్వర్యంలో ప్రతి గ్యారెంటీ అమలు జరుగుతుందని ఆయన తెలిపారు.

అనేకమంది ధరణి తో ఇబ్బందులు పడుతున్నారని, త్వరలోనే ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రెండు మూడు రోజుల్లో మరో శుభవార్త వినబోతున్నారు అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రజలు కోరుకునే ఇందిరమ్మ రాజ్యం కోసం అధికారులు అందరూ కలిసి పనిచేయాలని, గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేయాలని కూడా అధికారులకు సూచించామని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+