హైదరాబాద్ లో కొత్త బస్ టెర్మినళ్లు - ఈ ప్రాంతాల్లో ఏర్పాటు, ఇక నుంచి..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో ప్రయాణీకుల కోసం కొత్తగా కీలక మార్పులకు సిద్దమైంది. అందులో భాగంగా నగరంలోని ఎంపిక చేసిన నాలుగు ప్రాంతాల్లో బస్ టెర్మినల్స్ ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన చేసారు. ఈ నాలుగు బస్ టెర్మినల్స్ ద్వారా నగరంలో ట్రాఫిక్ కష్టాలు తొలగటంతో పాటుగా ప్రయాణీకులకు ఆర్టీసీ సేవలు మరింత సులభతరం అవుతాయని వివరించారు. ఈ ప్రాజెక్టు కు సంబంధించి పూర్తి వివరాలను మంత్రి వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడానికి మరియు రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి నగరం నలువైపులా నాలుగు కొత్త ఆధునిక బస్ టెర్మినల్స్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా హైదరాబాద్ పరిధిలో నాలుగు కొత్త బస్ టెర్మినల్స్ ఏర్పాటుకు డిసైడ్ అయింది. ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర వైపు వెళ్లే బస్సుల కోసం సుమారు 100 ఎకరాల్లో భారీ ఇంటర్నేషనల్ బస్ టెర్మినల్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

అదే విధంగా శంషాబాద్ విమానా శ్రయం సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన టెర్మినల్ ఏర్పాటు చేయనున్నారు. ఇక.. ఎల్బీనగర్ పరిధిలోని తూర్పు/దక్షిణ ప్రాంతాల ప్రయాణికుల కోసం కొత్త టెర్మినల్ ప్లాన్ చేసారు. అదే విధంగా ఘట్ కేసర్ వద్ద ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సుల రాకపోకల నియంత్రణకు వీలుగా టెర్మినల్ ఏర్పాటుకు నిర్ణయించారు.
నగరంలో ట్రాఫిక సమస్యలను పరిష్కరిస్తూ.. ప్రయాణీకులకు సంబంధిత ప్రాంతాల బస్సులు ఒకే చోట అందుబాటులో ఉండే విధంగా వీటిని ప్లాన్ చేసారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వైపు నుంచి హైదరాబాద్‌లోకి వచ్చే దూరప్రాంత, అంతర్ జిల్లా, అంత ర్రాష్ట్ర బస్సులను నగరంలోని అంతర్గత ప్రాంతాల్లోకి రాకుండా ఆయా దిశల్లో ఏర్పాటు చేసే టెర్మినల్స్ వరకు మాత్రమే నడిపించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు.
విమానాశ్రయం వైపు వెళ్లే బస్సులు, హైదరాబాద్‌కు వచ్చే అంతర్‌జిల్లా బస్సులు కూడా అవసరాన్ని బట్టి నిర్దేశిత టెర్మినల్స్ వద్దే నిలిపి, అక్కడి నుంచి ప్రయాణికులను నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలించే విధంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు. టెర్మినల్స్ నుంచి ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేలా సిటీ ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలను సమన్వయం చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది.














Click it and Unblock the Notifications
