షర్మిల రాజన్న రాజ్యం వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ.. ప్రజలు అన్ని రాజ్యాలు చూశాకే కేసీఆర్ కు పట్టం కట్టారని సెటైర్
తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు కోసం వైయస్ షర్మిల స్పీడ్ పెంచారు. ఇప్పటికే జిల్లాలలో వైయస్ అభిమానులతో, తనతో కలిసి వచ్చే ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్న షర్మిల ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కో ఆర్డినేషన్ కమిటీని వేసి మరి బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు.

ఖమ్మం వేదికగా బహిరంగ సభకు సిద్ధం అవుతున్న షర్మిల
ఖమ్మం జిల్లా వేదికగా తనపై విమర్శలు చేస్తున్న వారికి సమాధానం చెప్పాలని నిర్ణయించిన వైయస్ షర్మిల ఖమ్మం సభకు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా జనసమీకరణ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 100 మంది ఖమ్మం జిల్లా నేతలు, కార్యకర్తలతో లోటస్ పాండ్ లో సమావేశమై చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారమే తన అజెండాగా ప్రజల్లోకి వెళతామని షర్మిల ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి ఊపిరాడనివ్వకుండా పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.

షర్మిల పార్టీ పై మంత్రి పువ్వాడ వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే షర్మిల పార్టీపై, త్వరలో ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల మాట్లాడితే రాజన్న రాజ్యం తెస్తానని చెప్తున్నారని, ఖమ్మం ప్రజలు అన్ని రాజ్యాలు చూశారని, ఆ తర్వాత కేసీఆర్ వైపు మళ్ళారని పువ్వాడ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా రాజన్న రాజ్యం తెలంగాణ ప్రజలకు అవసరం లేదన్నారు. ఇక్కడి ప్రజలు ఎవరి ట్రాప్ లోనూ పడరని, ఒకవేళ చిన్నాచితకా నాయకులు పడితే వాళ్ల ఇష్టం అంటూ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో ప్రజల మద్దతు సీఎం కేసీఆర్ కే ఉందని కితాబు
ప్రజల మద్దతు మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కు ఉంటుందంటూ ధీమా వ్యక్తం చేశారు పువ్వాడ అజయ్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోందని ఆయన కితాబిచ్చారు.
ఇక ఇదే సమయంలో రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీ సంస్థ కు మూడు వేల కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్ కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్లో ఖమ్మం పట్టణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ 150 కోట్ల రూపాయలను కేటాయించారని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ హయాంలోనే ఖమ్మం జిల్లాలో అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications