మెడికల్ హబ్ గా వరంగల్.!కేసిఆర్ రాకతో ఓరుగల్లు వాసులు పులకించిపోయారన్న మంత్రి సత్యవతి రాథోడ్.!
వరంగల్/హైదరాబాద్ : ప్రజల ప్రాణాలే అత్యంత ప్రాధాన్యతగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలు పటిష్టం చేస్తున్నారని, ఇందులో భాగంగా వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ సందర్శించడంతో పాటు, కోవిడ్ రోగులను పరామర్శించడం వల్ల వారిలో భరోసా నింపారని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేసారు. వరంగల్ సెంట్రల్ జైలును సూపర్ స్పెషాలటీ హాస్పిటల్ గా తీర్చదిద్దుతామని సిఎం చేసిన ప్రకటన సాహసోపేతమైందని, ఆయనకు వరంగల్ ప్రజల పక్షాన కృతజ్ణతలు తెలుపుతున్నానన్నారు రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్.

ఉత్తర తెలంగాణకు ఆరోగ్యకేంద్రంగా ఓరుగల్లు అభివృద్ధి.. ప్రజలు రుణపడి ఉంటారన్న మంత్రి సత్యవతి..
కోవిడ్ మహమ్మారి విజృభిస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించాలని, 12 మెడికల్ సబ్ రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, 6 మెడికల్ కాలేజీలను పెట్టాలని అనుమతులు మంజూరు చేసి ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ప్రాముఖ్యతను తెలియజేశారన్నారు. వీటితో పాటు వరంగల్ నగరానికి వచ్చి, కోవిడ్ స్పెషల్ హాస్పిటల్ గా కొనసాగుతున్న ఎంజీఎంను ఎలాంటి పీపీఈ కిట్ లేకుండా సందర్శించి, రోగులను పరామర్శించి, వారికి నేనున్నాను అనే ధైర్యం చెప్పి, వరంగల్ నగరానికి శాశ్వత ప్రాతిపదికన వైద్య, ఆరోగ్య సేవలను పటిష్టం చేసే విధంగా వరంగల్ సెంట్రల్ జైలును సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా అభివృద్ధి చేస్తానని ప్రకటించడం నిజంగా అత్యంత సాహసోపేత నిర్ణయమన్నారు సత్యవతి రాథోడ్.

సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా సెంట్రల్ జైల్ నిర్ణయం సాహసోపేతం.. అభినందనలు తెలిపిన మంత్రి..
గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు వరంగల్ నగరానికి వచ్చినా ఇక్కడి ప్రజల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదని, సిఎం చంద్రవేఖర్ రావు వరంగల్ కు రావడం, రోగులకు అభయహస్తం ఇవ్వడం, వరంగల్ నగరానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను మంజూరు చేయడం గర్వంగా ఉందన్నారు సత్యవతి. ఇందులో భాగంగానే మహబూబాబాద్ జిల్లాకు కూడా మెడికల్ కాలేజీ, మెడికల్ సబ్ రీజినల్ సబ్ సెంటర్, ఆక్సిజన్ ప్లాంటు ఇవ్వడం, భూపాలపల్లి జిల్లాకు కూడా సబ్ రీజినల్ సెంటర్ ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రికి ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారన్నారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాలలో మెడికల్ కాలేజీ, సబ్ రీజినల్ సెంటర్లు రావడం వల్ల వీరికి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, గిరిజనుల పక్షాన సిఎం కు ధన్యవాదాలు తెలిపారు సత్యవతి రాథోడ్.

ఖైదీల కోసం ఓపెన్ జైల్.. సీఎం గొప్పతనానికి నిదర్శనమన్న సత్యవతి రాథోడ్
అంతే కాకుండా ప్రస్తుత ఎంజీఎం హాస్పిటల్ ను మెటర్నిటీ హాస్పిటల్ గా మార్చి, విస్తరిస్తామని చెప్పడం ఇక్కడి మహిళలు, శిశువులకు ఎంతో మేలు చేసే నిర్ణయమని, ఉమ్మడి ఓరుగల్లు మహిళలు, శిశువుల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. మాతా, శిశు ఆరోగ్య పరిరక్షణలో ఈ నిర్ణయం ఇక్కడి ప్రజలకు ఎంతో కీలకమైందన్నారు. సెంట్రల్ జైలులో ఉన్న ఖైదీలను పరామర్శించి, వారికి కల్పిస్తున్న వసతుల గురించి తెలుసుకుని, ఖైదీల సంపూర్ణ పరివర్తన కోసం ఓపెన్ జైలు ఏర్పాటు చేస్తామని చెప్పడం వారిపట్ల ఆయనకున్న సహృదయానికి మరొక నిదర్శనమన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.

వరంగల్ ఐటీ హబ్ మారింది.. ఇప్పుడు మెడికల్ హబ్ గా మారిందన్న స్త్రీ శిశు సంక్షేమ మంత్రి..
ఒకవైపు తెలంగాణకు ఆరోగ్య ప్రదాతగా కృషి చేస్తూ అపర భగీరథుడిగా రాష్ట్రాన్ని సాగునీటితో సస్యశ్యామలం చేయడంతో పుష్కలంగా ధాన్యం పండిందని, ఈ పండిన పంటను వెంటనే కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించడం సిఎం చంద్రశేఖర్ రావు గొప్పదనానికి నిదర్శనమని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ధాన్యం కొనుగోలు చేయడం లేదని, రైతుగా రైతు సమస్యలు తెలిసిన సిఎం చంద్రశేఖర్ రావు ఒక్కరే ఈ నిర్ణయం తీసుకున్నారని సత్యవతి చెప్పారు. ప్రభుత్వ దవాఖానాలలో అన్ని అత్యవసర మందులు, ఆక్సిజన్ వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు. కాబట్టి కోవిడ్ రోగులు ధైర్యంగా ఉండాలని మంత్రి సత్యవతి కోరారు.
Recommended Video
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications