బీజేపి నేతల్లారా.!నోరు అదుపులో పెట్టుకోండి.!ఖబడ్దార్.!మంత్రి సత్యవతి ఘాటు హెచ్చరికలు.!

హైదరాబాద్ : దేశంలో, రాష్ట్రంలో రైతులను ఇబ్బండిపెడుతూ రాజకీయం చేస్తున్న బిజెపి నేతలపై రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి, ఎముకలు కొరికే చలిలో రైతులను ఏడాది పాటు ఇబ్బంది పెట్టిన దేశ ప్రధానినే పంజాబ్ లో రైతులు రోడ్డు మీద నిలబెట్టారని, మిగిలిన బిజెపి నేతలకు కూడా ఇదే గతి పడుతుందని మంత్రి హెచ్చరించారు. బిజెపి నేతలు నాలుకలు అదుపులో పెట్టుకోకపోతే వారికి పుట్టగతులు ఉండవన్నారు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్.

 బిజెపి నేతల్లారా ఖబడ్దార్.. నాలుకలు అదుపులో పెట్టుకోకపోతే గుణపాఠం తప్పదన్న మంత్రి

బిజెపి నేతల్లారా ఖబడ్దార్.. నాలుకలు అదుపులో పెట్టుకోకపోతే గుణపాఠం తప్పదన్న మంత్రి

తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాయకత్వంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం, కాళేశ్వరం వంటి భారీ బహుళసార్థక ప్రాజెక్టు నిర్మించడం, రైతుబంధు, రైతు బీమా పథకాలు పెట్టడం వల్ల తెలంగాణ రైతులు దేశానికి అన్నం పెట్టే స్థాయికి వచ్చారన్నారు. తెలంగాణ రైతుల కల్లాల్లో పుష్కలమైన ధాన్యాన్ని చూసి కండ్లు మండి, ఓర్వలేక బిజెపి నేతలు తెలంగాణ ధాన్యాన్ని కొనడం లేదని, మా రైతులను ఇబ్బంది పెడుతున్నారని, ఇదే పద్దతి కొనసాగితే బిజెపికి ఇక్కడ ప్రజలు గుణపాటం చెప్తారని హెచ్చరించారు.

 పగటి బిచ్చగాళ్ల పనులు మానుకోవాలి.. బిజెపి తప్పుడు నిర్ణయాలతో రైతులకు ఇబ్బందులన్న సత్యవతి

పగటి బిచ్చగాళ్ల పనులు మానుకోవాలి.. బిజెపి తప్పుడు నిర్ణయాలతో రైతులకు ఇబ్బందులన్న సత్యవతి

బిజెపి నేతలు కొత్త బిచ్చగాళ్ల వలె రాష్ట్రంలో పర్యటిస్తూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, తమ రాష్ట్రంలో గెలువని నేతలు ఇక్కడ వచ్చి కోతలు కోస్తున్నారని మండిపడ్డారు. కొట్లాడి సాధించిన తెలంగాణలో దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు అసాముల వద్దకు వెళ్లి పెట్టుబడి కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండకూడదని సిఎం చంద్రశేఖర్ రావు రైతుబంధు పథకం తీసుకొచ్చారన్నారు. రైతుబంధు పథకం కింద నాలుగు ఏళ్లలో ఎనిమిది దఫాలుగా ఇప్పటికే రైతుల ఖాతాల్లో 50,536 కోట్ల రూపాయలను జమ చేయడం అత్యంత గొప్ప విషయమన్నారు.

 పంజాబ్ రైతులు ప్రధానినే రోడ్డు మీద నిలబెట్టారు.. బీజేపి నేతలకు అదే గతి పడుతుందన్న రాథోడ్

పంజాబ్ రైతులు ప్రధానినే రోడ్డు మీద నిలబెట్టారు.. బీజేపి నేతలకు అదే గతి పడుతుందన్న రాథోడ్

గత నాలుగేళ్లుగా చిన్న రైతుగా ఉన్న తన ఐదెకరాలకు ప్రతిసారి 25వేల రూపాయల చొప్పున ఏడు దఫాలుగా 1,75,000 రూపాయలు వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వల్లె తెలంగాణ నేడు సస్యశ్యామలంగా మారిందన్నారు. ఎండాకాలంలోనూ చెరువులు మత్తడి పోస్తున్నాయని తెలిపారు. గతంలో బాబ్లీ వద్ద ప్రాజెక్టులు అక్రమంగా నిర్మిస్తుంటే ఎస్.ఆర్.ఎస్.పి ఏడారి అవుతుందని, నేను కూడా బాబ్లీకి వ్యతిరేకంగా పోరాడానన్నారు. అయితే చంద్రశేఖర్ రావు దీర్ఘదృష్టి వల్ల నేడు తెలంగాణలో కాళేశ్వరం వంటి ప్రాజెక్టు కట్టి నీటిని ఎగువకు పారిస్తున్నారన్నారు.

 రాష్ట్రానికి నిధులు ఇవ్వరు, జాతీయ హోదా ఇవ్వరు.? ఐనా కేసీఆర్ ను విమర్శిస్తారా అని ప్రశ్నించిన మంత్రి

రాష్ట్రానికి నిధులు ఇవ్వరు, జాతీయ హోదా ఇవ్వరు.? ఐనా కేసీఆర్ ను విమర్శిస్తారా అని ప్రశ్నించిన మంత్రి

బిజెపి ప్రభుత్వం తెలంగాణ పథకాలను ప్రశంసిస్తూ ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే రాష్ట్ర బిజెపి నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పొలవరానికి నిధులు ఇస్తూ మూడేళ్లలో నిర్మించి లక్షల ఎకరాలకు నీళ్లు అందించే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటే అతీ, గతి లేదన్నారు. కనీసం రైతులకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేని బీజేపి నాయకులు చంద్రశేఖర్ రావు మీద అవాకులు చవాకులు పేలుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+