గవర్నర్ వ్యవస్థ అవసరం లేదు - ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా : మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు..!!
తెలంగాణలో ఇప్పుడు గవర్నర్ - ప్రభుత్వం మధ్య గ్యాప్ పెరుగుతోంది. తాజాగా ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ- అమిత్ షా తో భేటీ అయిన గవర్నర్ ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వం పైన వ్యాఖ్యలు చేసారు. తనను అవమానించారని వ్యాఖ్యానించారు. ఇక, మీడియా ప్రతినిధులతో చిట్ ఛాట్ లో అసెంబ్లీ సమావేశాల అనుమతి ఇవ్వకపోతే..అసెంబ్లీ రద్దు అయి ఉండేదని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల పై ఇప్పటికే పలువురు తెలంగాణ మంత్రులు స్పందించారు. ఇప్పుడు మరో మంత్రి తలసాని సీరియస్ వ్యాఖ్యలు చేసారు.
గవర్నర్ వ్యవస్థ వద్దని ఎప్పట్నుంచో డిమాండ్ ఉందని.. ఆ వ్యవస్థ అసరమే లేదని స్పష్టం చేసారు. గవర్నర్‌కి కూడా పరిమితులు ఉంటాయి... ప్రధాని, హోం మంత్రిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న, మెజార్టీ ఉన్న ప్రభుత్వాన్ని గవర్నర్ ఎలా రద్దు చేస్తారని నిలదీసారు. బీజేపీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను రాజ్యసభకు పంపలేదా..పెద్దల సభలో నియామకాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందేనని చెప్పుకొచ్చారు. గవర్నర్ మీడియాతో రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. గవర్నర్లను ఎలా గౌరవించాలో సీఎంతో పాటుగా తమకూ తెలుసన్నారు.

గవర్నర్లను గౌరవించడంలో సీఎం కేసీఆర్ అందరికంటే ముందుంటారని తెలిపారు. గవర్నర్లను గౌరవించడంలో సీఎం కేసీఆర్ అందరికంటే ముందుంటారని తలసాని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ వెనుక ఎవరు ఉన్న వదలా వద్దని సీఎం కేసీఆర్ ఇప్పటికే చెప్పారన్నారు. నాడు ఎన్టీఆర్‌ను గద్దె దించేందుకు గవర్నర్‌ను వాడుకున్నారంటూ వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి మీడియాతో మాట్లాడలేను అని చాలా సార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. సెక్షన్ 8 అమలు దేనికి అంటూ నిలదీసారు. ఇదే సమయంలో కేంద్రానికి వ్యతిరేకంగా 11వ తేదీన ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ భవనలో నిరసనలకు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు సిద్దం అవుతున్నారు,












Click it and Unblock the Notifications