రేవంత్ రెడ్డి పై మంత్రి తలసాని వ్యాఖ్యలు...ఏమన్నారంటే..?
తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. బేగంపేటలో అత్యాధునిక వైకుంఠ ధామాన్ని మంత్రి కేటీఆర్ తో కలిసి ప్రారంభించిన ఆయన ప్రతిపక్ష పార్టీల పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని,రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు తలసాని.
రేవంత్ రెడ్డి ని వీడు వాడు అంటూ సంబోధించి నా కొడకా...పిసికితే ప్రాణం పోతది అంటూ అంటూ మంత్రినన్న విషయాన్ని కూడా మర్చిపోయి తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, వరదలు వచ్చినప్పుడు నగరవాసులు చాలా ఇబ్బంది పడ్డారని పేర్కొన్న ఆయన,దీనికి గత ప్రభుత్వాలు కారణం కాదా అంటూ ప్రశ్నించారు .

పాత సెక్రటేరియట్ ను కూలగొట్టి కొత్తది కడదామంటే చాలామంది గొడవపడి కేసులు కూడా వేశారని,ఇప్పుడు నూతన సెక్రటేరియట్ లోకి నా కొడుకులు ప్రతి ఒక్కరూ వస్తామని అంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ సెక్రటేరియట్ ఒక అద్భుతమైన సెక్రటేరియట్ అని,చూస్తే అమెరికాలోని వైట్ హౌస్ చూడాలని, లేదంటే తెలంగాణ రాష్ట్రంలోని సెక్రటేరియట్ చూడాలని పేర్కొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తెలంగాణలో అమలు చేస్తున్నాం కాబట్టే తెలంగాణ సెక్రటేరియట్ కు ఆయన పేరు పెట్టామని పేర్కొన్నారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ పొట్టోడు డిక్లరేషన్ గురించి మాట్లాడుతాడు అని, వాడి నోటికి అడ్డూ అదుపూ లేదని, ఎమ్మెల్యే, మంత్రి అన్నది కూడా లేదని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి దుర్భాషలాడారు.
వాడు అందరి గురించి వాడు వీడు అని మాట్లాడతాడని, ఇంత లేడు.. వాడి పర్సనాలిటీ ఎంత.. వాడు ఎంత? పిసికితే ప్రాణం పోతుంది నా కొడుక్కు .. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణలో సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని, మరి బీజేపీ నాయకులు ఎక్కడైనా గుడి కట్టారో చూపించాలన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టటం తప్ప బీజేపీ మరేమీ చెయ్యదని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications