రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే!

తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతులకు శుభవార్త చెప్పింది. తెలంగాణా రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తున్నామని చెప్పిన సర్కార్ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించటానికి, రైతులకు ఆర్థిక సౌలభ్యం కల్పించే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27 నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకం సబ్సిడీ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయటానికి నిర్ణయం తీసుకుంది.

రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల

తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న వానాకాలం సీజన్ సన్నద్ధతపై జరిగిన సమీక్షలో మాట్లాడిన ఆయన వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి యాంత్రీకరణ సబ్సిడీ నిధులు నేరుగా రైతుల ఖాతాలలోకే జమ అవుతాయని శుభవార్త చెప్పారు. ప్రస్తుతం, ఎంపిక చేసిన యంత్రాలకు రైతులు వాటా చెల్లించాక, ప్రభుత్వం 40% సబ్సిడీని కంపెనీలకు విడుదల చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

minister Tummala said agricultural mechanization subsidy will directly credited to farmers accounts

వచ్చే వానాకాలం సీజన్ కోసం యూరియాకి ఏర్పాట్లు

రానున్న వ్యవసాయ సీజన్‌లో 1.50 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశముందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంచనా వేశారు. రైతులకు రానున్న సీజన్ లో యూరియా కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. 11.50 లక్షల టన్నుల యూరియా కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్టు తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. యూరియా సరఫరా ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని అధికారులను తుమ్మల ఆదేశించారు.

రాగి పంట వ్యర్థాలతో కూడా ప్యాకింగ్ ఉత్పత్తులు

రైతు వేదికలలో సౌరవిద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని భారతీయ రసాయన సాంకేతికత పరిశోధన సంస్థ సైంటిస్టులు రాగి పంట వ్యర్థాలతో కూడా ప్యాకింగ్ ఉత్పత్తులు తయారుచేసే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. రైతులు సాధారణంగా పారవేసే రాగి కంకులు, పొట్టు, కాండం, ఆకులను ఈ ప్యాకింగ్‌కు ఉపయోగిస్తారు.

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా నానో సెల్యులోజ్‌

పరిశోధకులు ఈ వ్యర్థాలలోని ప్రతి భాగాన్ని వేరుచేసి, వాటి నుంచి అల్ఫా సెల్యులోజ్, నానో క్రిస్టలైన్ సెల్యులోజ్, మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్‌లను గుర్తించారు.నానో సెల్యులోజ్‌లో 55 శాతం స్ఫటికత్వం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్యాకేజింగ్ పరిశ్రమలో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా నానో సెల్యులోజ్‌ను ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా, ఔషధాల తయారీలో, వాహన రంగంలో బయో మెటీరియల్స్‌గా కూడా దీనికి విస్తృత ఉపయోగాలున్నాయని చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+