వైఎస్ఆర్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఎఫెక్ట్ వైఎస్ షర్మిలకేనా!!
గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల, వైయస్ పాలన తీసుకువస్తానని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ పాదయాత్ర చేస్తుంటే, తెలంగాణ రాష్ట్రానికి వైయస్సార్ తీరని ద్రోహం చేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాలలో ఆసక్తికరంగా మారాయి. ఈ వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల సమాధానం చెప్తారా అన్నది ఉత్కంఠగా మారింది.

తెలంగాణా రాకుండా చెయ్యాలని అడ్డు పడింది వైఎస్సార్: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం రాకుండా చేయాలని అడ్డుపడింది వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ఇస్తే పార్టీకి రాజీనామా చేస్తానంటూ బెదిరించారని, బ్లాక్ మెయిల్ చేశారని వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణంగా నాడు తెలంగాణ రాష్ట్రంలో వందల సంఖ్యలో విద్యార్థులు అమరులు అయ్యారని వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణా ఇవ్వొద్దని సోనియా గాంధీన్ బ్లాక్ మెయిల్ చేశారు
ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలన అందించారని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల చెబుతుంటే, రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ద్రోహి అన్న తీరుగా వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యమకారులు, విద్యార్థులు పోరాటం చేస్తుంటే, వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ విషయంపై అప్పటి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని బ్లాక్ మెయిల్ చేశారని తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఇస్తామని కాలయాపన చేస్తూ, మాట దాట వేశారని, మరోవైపు సోనియా గాంధీని బ్లాక్ మెయిల్ చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఇవ్వద్దని చెప్పారని వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

వైఎస్సార్ వల్లే వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు
తెలంగాణ విషయంలో తాత్సారం చేస్తున్నారని భావించిన కేసీఆర్ దీక్షాదివస్ నాడు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ ఉద్యమ గతిని మార్చారని వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. తనకిచ్చిన కేంద్రమంత్రి పదవిని గడ్డిపోచలాగా విసిరేసి, ఏ రాజకీయ నాయకుడు చేయలేని పనిని కెసిఆర్ చేసి చూపించారని వేముల ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని కాంగ్రెస్ పార్టీ నాడు నాన్చుడు ధోరణి వల్లే, వైయస్ రాజశేఖర్ రెడ్డి వ్యవహారశైలి వల్లే తెలంగాణ రాష్ట్రంలో వందలాదిమంది ప్రాణాలు పోగొట్టుకున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

వైఎస్సార్ తెలంగాణా పార్టీకి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యల షాక్
తెలంగాణాలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకువస్తానని చెప్తూ పర్యటన చేస్తున్న వైఎస్ షర్మిలను పరోక్షంగా వేముల ప్రశాంత్ రెడ్డి టార్గెట్ చేశారు. వైఎస్సార్ తెలంగాణా రాష్ట్రానికి చేసిందేమీ లేదని వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే యత్నం చేశారు. అయితే ఇదంతా షర్మిల పార్టీని టార్గెట్ చేస్తూనే అన్న టాక్ వినిపిస్తుంది. తెలంగాణా రాష్ట్రంలో వైఎస్సార్ పట్ల అభిమానం వ్యక్తం చేసే వారు అనేకమంది ఉన్నారు. వారందరికీ వైఎస్సార్ వల్లే తెలంగాణా ఆలస్యం అయ్యింది అని చెప్పే ప్రయత్నం చేశారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications