పంజాబ్ రైతాంగం మిమ్మల్ని ఈడ్చితన్నింది; మీరు డిక్లరేషన్ చేస్తారా?: తెలంగాణా మంత్రుల ధ్వజం

వరంగల్లో రాహుల్ గాంధీ నిర్వహించిన సభపై, కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ పై తెలంగాణ రాష్ట్ర మంత్రులు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలను, చేసిన వాగ్దానాలను తెలంగాణ ప్రజలు నమ్మబోరని స్పష్టం చేస్తున్నారు. రైతు డిక్లరేషన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

వరంగల్ లో జరిగింది రాహుల్ సంఘర్షణ సభ

రాహుల్ గాంధీ సభపై తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ను పంజాబ్ రైతులే నమ్మలేదని, చైతన్యవంతులైన తెలంగాణ రైతులు ఎలా నమ్ముతారు అంటూ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. వరంగల్ లో జరిగింది రైతు సంఘర్షణ సభ కాదని, రాహుల్ గాంధీ సంఘర్షణ సభ అంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజానీకం కూడా అదే భావిస్తుందని పేర్కొన్నారు.

పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నింది: హరీష్ రావు

పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నింది: హరీష్ రావు

ఇక ఇదే సమయంలో రాహుల్ గాంధీ గారు, వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నింది అని ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు మంత్రి హరీష్ రావు. పంజాబ్ రైతులు నమ్మని మీ రైతు డిక్లరేషన్ తెలంగాణ రైతాంగం ఎలా నమ్ముతుందని ప్రశ్నించారు. ఎయిర్ పోర్ట్ లో దిగి ఇవాళ ఏం మాట్లాడాలి? సభ దేని గురించి అని అడిగిన రాహుల్ గాంధీకి తెలంగాణ రైతుల గురించి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది అంటూ వ్యాఖ్యానించారు.

డిక్లరేషన్ ప్రకటించేందుకు రాహుల్ కు అర్హత లేదు: జగదీశ్ రెడ్డి

డిక్లరేషన్ ప్రకటించేందుకు రాహుల్ కు అర్హత లేదు: జగదీశ్ రెడ్డి

ఎప్పటికీ తెలంగాణలోని సబ్బండ వర్ణాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేసే ఏకైక పార్టీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రైతు డిక్లరేషన్ ప్రకటించిన రాహుల్ గాంధీ సభ పై మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి డిక్లరేషన్ ప్రకటించేందుకు రాహుల్ కు అర్హత లేదు అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మాటలన్నీ నీటి మూటలేనని, 60 ఏళ్లుగా తెలంగాణకు ఆ పార్టీ నాయకులు చేసిన అన్యాయాన్ని ఇక్కడి ప్రజలు ఎవరూ మరచిపోరు అని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ మాటలలో పస లేదు

వరంగల్ సభలో రాహుల్ గాంధీ ఏ హోదాలో మాట్లాడారో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. ఏఐసీసీ ప్రతినిధిగా మాట్లాడారా? పిసిసి ప్రతినిధిగా మాట్లాడారా? చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరో రాసిన చిలకపలుకులు తప్ప రాహుల్ మాటలలో పస లేదని విమర్శించారు. అధికారంలోకి రావాలనే ఆకాంక్ష తప్ప ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ కొత్తగా చేసిందేమీ లేదని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదు అంటూ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+