మైనర్ బాలిక మాన ప్రాణానికి వెల రూ.5 లక్షలు: పెద్దల పంచాయితీ, ఏర్గాట్‌పల్లిలో దారుణం..
అల్లారుముద్దుగా పెరిగిన బాలికపై కామాంధుడు కన్నేశాడు. మైనర్ బాలికపై రేప్ చేశాడు. దీంతో ఆమె అవమానానికి గురయ్యింది. లాభం లేదనుకొని ఆత్మహత్య చేసుకుంది. తర్వాత సీన్ మారింది. పంచాయతీ పెద్దలు రంగంలోకి దిగారు. బాలిక మాన, ప్రాణానికి వెల కట్టారు. రూ. 5 లక్షలు ఇప్పిస్తామని.. తప్పుడు కేసు పెట్టాలని బాలిక తండ్రిని ఒప్పించారు. ఆ నాన్న కూడా అలానే వ్యవహరించారు. కానీ అప్పటికే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. కేసు విచారణ చేపట్టారు. నారాయణ పేట జిల్లాలో జరిగిన దారుణం కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది.

మైనర్ బాలికపై రేప్..
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం ఏర్గాట్‌పల్లిలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలిక తన పేరంట్స్‌తో కలిసి ఉంటోంది. అయితే గ్రామానికి చెందిన బాలప్ప ఈమెపై కన్నేశాడు. ఒంటరిగా ఉండటం చూసి లైంగికదాడి చేశాడు. దీంతో చిన్నారి అవమానంతో కుమలిపోయింది. ఇక లాభం లేదనుకొని.. మంగళవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. నారాయణ పేట ఆస్పత్రి అటు నుంచి మహబూబ్ నగర్ తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. బాలిక మార్గమధ్యలోనే చనిపోయింది.

లైంగికదాడి వల్లే ఆత్మహత్య..
విషయం మాత్రం బయటకు పొక్కింది. బాలప్ప లైంగికదాడి చేయడం వల్లే ఆత్మహత్య చేసుకుందని అందరికీ తెలిసింది. దీంతో గ్రామ పెద్దలు రంగంలోకి దిగారు. బాలప్పను కాపాడేందుకు ప్రయత్నం చేశారు. సర్పంచ్ తండ్రి బాలకిష్టయ్య, నిందితుడి తండ్రితో మాట్లాడారు. బాలిక తండ్రికి రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ఒప్పించారు. గ్రామ పెద్దలకు భయపడ్డాడో ఏమో కానీ బాలిక తండ్రి అందుకు ఒప్పుకున్నాడు. కానీ ఇంతలో విషయం సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యింది. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు.

పోలీసులు వచ్చేలోపే.. రూ.5 లక్షలతో సెటిల్ మెంట్..
పోలీసులు వచ్చే ముందే సెటిల్ మెంట్ చేశారు. అయితే కేసు స్వరూపాన్నే మార్చారు. కూతురు బాలప్పతో సన్నిహితంగా ఉందని తెలిసిందని చెప్పమన్నారు. అందుకు మందలించడంతో ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొనాలని తెలిపారు. ఫిర్యాదులో లైంగికదాడి జరిగిన విషయం చెప్పొద్దని బాలిక తండ్రిని ఒప్పించారు. ఒప్పందం మేరకు మృతురాలి తండ్రి పోలీసు స్టేషన్‌లో పెద్దలు చెప్పినవిధంగా ఫిర్యాదు చేశారు.
Recommended Video

సోషల్ మీడియాలో వైరల్..
అప్పటికే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు గ్రామానికి వచ్చారు. బాలిక శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని.. బాలిక కుటుంబానికి న్యాయం చేస్తామని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications