భాగ్యనగరంలో ఆవిష్కృతమైన అద్భుతం; రెండు నిముషాలు నీడ మాయం!!
గ్రేటర్ హైదరాబాద్ లో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది.చాలా అరుదైన జీరో షాడో నేడు భాగ్యనగరంలో ఆవిష్కృతమైంది. నేడు మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల నుండి 12:14 వరకు రెండు నిమిషాల వ్యవధిలో నీడ మాయమైంది.అంటే సహజంగా మన నీడ మనకు కనిపిస్తుంది. అసలు నీడ మాయం అవుతుందనే విషయం కూడా మనకు తెలీదు. కానీ జీరో షాడో డే రోజు మన నీడ మనకి కనిపించదు.
ఇక అటువంటి అరుదైన సంఘటన ఈ రోజు రెండు నిమిషాల పాటు హైదరాబాద్లో ఆవిష్కృతమైంది. అయితే జీరో షాడో అంటే ఏమిటి? దీనివల్ల ఏం జరుగుతుంది అంటే..సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల జీరో షాడో ఏర్పడుతుంది. నేడు ఎండలో నిటారుగా ఉంచిన, 90 డిగ్రీలలో ఉన్న వస్తువుల మీద రెండు నిమిషాల పాటు నీడ కనిపించదని బిర్లా సైన్స్ సెంటర్ అధికారులు పేర్కొన్నారు. అధికారులు చెప్పినట్టుగానే ఈరోజు జీరో షాడో ఆవిష్కృతమైంది.

సూర్యుడు మన తలమీదుగా వెళ్ళినట్టుగా కనిపిస్తున్నా,నీడ పడదని అధికారులు చెప్పినట్టే జరిగింది.సూర్యుడు ప్రతీ సంవత్సరం ఉత్తరాయణం లోకి,దక్షిణాయణం లోకి ప్రవేశించిన రెండుసార్లు ఈ జీరో షాడో మూవ్మెంట్ ఉంటుందని చెబుతున్నారు. సూర్యుని గమనం ఉత్తరాయణంలో ఆరునెలలు ఉత్తరదిశగా,దక్షిణాయనంలో ఆరు నెలలు దక్షిణ దిశగా ఉంటుంది.
ఈ సమయంలో భూమి ఒంపు సుమారు 23.5 డిగ్రీలు ఉండడంవల్ల భూమధ్యరేఖకు అన్ని డిగ్రీల ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో సూర్యుడు మధ్యాహ్నం నేరుగా తల మీద నుంచి వెళ్తాడని చెబుతున్నారు. అయినప్పటికీ 90డిగ్రీలలో ఉన్న వస్తువుల పైన సంవత్సరానికి రెండు సార్లు నీడ పడదని, దానిని జీరో షాడో మూవ్మెంట్ అంటారని చెబుతున్నారు. ప్రతిరోజు సూర్యుడు మధ్యాహ్నం తలమీదుగా వెళుతున్నట్టు కనిపిస్తున్నా జీరో షాడో పడదని అధికారులు చెబుతున్నారు.
ఇక ఈ అద్భుతాన్ని హైదరాబాద్ నగర వాసులు ఎంజాయ్ చేశారు. ఈ సమయంలో నిల్చుని నీడ పడకపోవడాన్ని ప్రతి ఒక్కరు గుర్తించారు. నీడ మాయం అవుతుందని తెలుసుకున్న చాలా మంది ఈ రోజును సెలబ్రేట్ చేసుకున్నారు. నీడలేని తమ ఫోటోలను తీసుకొని సంబరపడిపోయారు. ఎప్పుడూ మన వెంట ఉండే మన నీడ, సంవత్సరానికి రెండు సార్లు ఉండదని తెలుసుకొని ఆశ్చర్యానికి గురయ్యారు.












Click it and Unblock the Notifications