లాడ్జిలో లైంగిక వాంఛ తీర్చుకున్నాడు: వ్యభిచారానికి అమ్మేశాడు
హైదరాబాద్: హైదరాబాదులో మూడు రోజుల క్రితం అదృశ్యమైన మైనర్ బాలిక కేసులో సీఐడీ అధికారులు పురోగతి సాధించారు. ప్రేమ పేరుతో ఏలూరుకు చెందిన వ్యక్తి ఆ బాలికను మోసం చేశాడని అధికారులు గుర్తించారు.అమ్మాయి సెల్‌ఫోన్ ట్రాకింగ్ చేసిన సీఐడీ అధికారులు కాల్‌డేటా ఆధారంగా విచారణ సాగించారు.
ఈ సీఐడీ దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయి. సీఐడీ అధికారులు తెలిపిన ప్రకారం పెళ్లి చేసుకుంటానని మైనర్ బాలికను నమ్మించి విజయవాడ తీసుకెళ్లాడు. రెండురోజులపాటు హోటల్లో బసచేసి ప్రియుడు లైంగికవాంఛలను తీర్చుకున్నాడు.

అనంతరం రెండురోజుల్లో వస్తానని చెప్పి ఆ బాలికను తన స్నేహితుడి గదిలో దింపి వెళ్లాడు. స్నేహితుడిగా పరిచయం చేసిన ఆ వ్యక్తి ఆ బాలికను రూ.50వేలకు ఆమెను కొనుగోలు చేసినట్టు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది.
ఇటువంటి స్థితిలో ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక, తల్లిదండ్రుల పరువు తీయలేక బాధితురాలు వ్యభిచార కూపంలో ఉండిపోయిందని సీఐడీ అధికారులు తెలిపారు. కేవలం ఈ కేసు కాకుండా ప్రస్తుత విచారణలో పలు మిస్సింగ్ కేసులు బయటపడుతున్నాయని అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications