Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ కీలక నిర్ణయం - టార్గెట్ ఫిక్స్ ..!!

తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ తొలి సమావేశం ఈ రోజు ప్రారంభం కానుంది. ప్రోటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసి ప్రమాణం చేసారు. కొత్త ఎమ్మెల్యే‌లతో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఎన్నికల ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్..సాగునీటి ప్రాజెక్టులు..ఆర్దిక నిర్వహణ..తాజా పరిస్థితులను ప్రజల ముందు ఉంచాలని డిసైడ్ అయ్యారు.

ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. తొలి అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. కొత్త ఎమ్మెల్యే‌లతో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాజ భన్ లో జరిగిన ప్రొటెం స్పీకర్ ప్రమాణానికి సీఎం రేవంత్, బీఆర్ఎస్ నుంచి పోచారం, హరీష్ హాజరయ్యారు. ఈ సారి అసెంబ్లీకి కొత్తగా 51 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికైన ప్రతీ ఎమ్మెల్యే గెలిచిన పత్రం రెండు కాపీల జిరాక్స్, రెండు ఫోటోలు తేవాలని అసెంబ్లీ సెక్రెటరీ ఆదేశాలు జారీ చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్‌గా ఎన్నిక వల్ల బీజేపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తరువాత స్పీకర్ ఎన్నిక నోటిఫకేషన్ వెలువడనుంది. కొత్త స్పీకర్ గా కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే ప్రసాద కుమార్ ను ఖరారు చేసింది.

MLA Akbaruddin Owaisi takes oath as new pro-tem Speaker for the Assembly

కొలువు తీరుతున్న అసెంబ్లీ : ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ప్రమాణస్వీకారానికి హాజరు కావాలని కోరుతూ అసెంబ్లీ కార్యదర్శి లేఖలు రాశారు. మూడో శాసనసభ మొదటి సమావేశాన్ని పురస్కరించుకొని అసెంబ్లీకి రంగులు వేయించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈసారి అసెంబ్లీలో 51 మంది కొత్తవారు అడుగుపెడుతున్నారు. వీరిలో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ఈసారి ఏకంగా 8మంది కొత్తవారు ఎన్నికయ్యారు. కొత్తగా అడుగుపెడుతున్న వారిలో 18మంది ఎమ్మెల్యేలకు ఎలాంటి రాజకీయ రాజకీయ అనుభవం లేకపోవడం గమనార్హం. వీరందరూ తొలిసారి పోటీచేసి గెలుపొందినవారే. మజ్లిస్‌ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా ఉంటే ఆయన సమక్షంలో తాను ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయబోనని గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్‌ స్పష్టం చేశారు.

MLA Akbaruddin Owaisi takes oath as new pro-tem Speaker for the Assembly

రేవంత్ మార్క్ నిర్ణయాలు : ఇక..పాలనలో తన మార్క్ చూపించేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితులను ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించారు. ఇప్పటికే శాఖల వారీగా ఆర్దిక స్థితి పైన పూర్తి వివరాలతో నివేదిక సిద్దం చేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ పైన సమీక్ష చేసిన రేవంత్..ఆ శాఖలో ఉన్న రుణాలు...రెవిన్యూ పైన వివరాలు సేకరించారు. తన ప్రభుత్వం ఏర్పాటు అయ్యే సమయానికి రాష్ట్రంలో ఉన్న ఆర్దిక పరిస్థితిని శాసనసభా వేదికగా ప్రజల ముందు ఉంచాలనేది సీఎం రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. ఇందు కోసం శాసనసభను నాలుగు రోజులు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రోజు అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఆ తరువాత సమావేశాలు కొనసాగిస్తారా..లేక మీడియా సమావేశాల ద్వారా ఈ వివరాలను వెల్లడిస్తారా అనేది స్పష్టత రానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+