తెలుగుజాతి బాగుండాలి: బాలకృష్ణ, ఫ్యామిలీతో వివిఎస్ లక్ష్మణ్ పుష్కర స్నానం
నల్గొండ/మహబూబ్‌నగర్: తెలుగు రాష్ట్రాల్లో పుష్కర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏడో రోజైన గురువారం తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో కలిపి 17 లక్షల 50 వేల మంది పుణ్యస్నానాలు ఆచరించగా, ఇప్పటివరకు కోటీ 60 వేల మంది భక్తులు పవిత్రస్నానాలు చేశారు. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా పుష్కర స్నానమాచరించారు.
తెలుగు రాష్ట్రాలు నాకు రెండు కళ్లు
తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లలాంటివని హిందూపురం టిడిపి శాసనసభ్యుడు, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. గురువారం ఆయన కుటుంబ సమేతంగా సోమశిలలో పుష్కర స్నానం చేసిన తర్వాత అలంపూరు ఆలయాలను దర్శించకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ గురురాజ, అర్చకులు, టిడిపి నేత ఆంజనేయులు, జడ్పీటీసీ సభ్యులు సూర్యబాబుగౌడు పూర్ణకుంభంతో బాలకృష్ణ కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. పుష్కరాల ప్రారంభం రోజు విజయవాడలో పుణ్యస్నానం ఆచరించి దుర్గమ్మను దర్శించుకున్నానని, పౌర్ణమి సందర్భంగా జోగుళాంబ దర్శించుకున్నానని తెలిపారు. తెలుగు జాతి బాగుండాలని.. ప్రపంచం సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు.
కాగా, బాలకృష్ణ రాకతో ఆలయాల వద్ద ఆయన అభిమానులు, టిడిపి కార్యకర్తల సందడి నెలకొంది. భక్తులు సైతం ఆయనను చూసేందుకు, కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. బాలకృష్ణ దంపతులకు, కుటుంబీకులు, బంధువులకు కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు అతిథ్యం ఇచ్చారు.
కొల్లాపూర్‌లోని కేఎల్‌ఐ అతిథిగృహంలో అల్పాహారం ఏర్పాటు చేసి వాహనంలో సోమశిలలోని వీఐపీ ఘాటుకు తీసుకెళ్లారు. వివిధ రకాల వంటలను తయారు చేయించి మంత్రి ప్రత్యేకంగా వడ్డించారు. మహబూబ్‌గర్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిల నదీతీర ప్రాంతం, చుట్టూ కొండలు ఎంతో ప్రకృతి రమణీయంగా ఉన్నాయని, ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రాంతం అద్భుతంగా ఉన్నదని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.
కుటుంబంతో కలిసి లక్ష్మణ్
అడవిదేవులపల్లి ఘాట్‌లో ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబ సమేతంగా పుష్కర స్నానం చేశారు. లక్ష్మణ్ వెంట ఆయన సతీమణి, పిల్లలు ఉన్నారు.

బాలకృష్ణ
తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లలాంటివని హిందూపురం టిడిపి శాసనసభ్యుడు, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. గురువారం ఆయన కుటుంబ సమేతంగా సోమశిలలో పుష్కర స్నానం చేసిన తర్వాత అలంపూరు ఆలయాలను దర్శించకున్నారు.

బాలకృష్ణ
ఈ సందర్భంగా ఆలయ ఈఓ గురురాజ, అర్చకులు, టిడిపి నేత ఆంజనేయులు, జడ్పీటీసీ సభ్యులు సూర్యబాబుగౌడు పూర్ణకుంభంతో బాలకృష్ణ కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు.

బాలకృష్ణ
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. పుష్కరాల ప్రారంభం రోజు విజయవాడలో పుణ్యస్నానం ఆచరించి దుర్గమ్మను దర్శించుకున్నానని, పౌర్ణమి సందర్భంగా జోగుళాంబ దర్శించుకున్నానని తెలిపారు. తెలుగు జాతి బాగుండాలని.. ప్రపంచం సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు.

కుటుంబంతో కలిసి లక్ష్మణ్
అడవిదేవులపల్లి ఘాట్‌లో ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబ సమేతంగా పుష్కర స్నానం చేశారు. లక్ష్మణ్ వెంట ఆయన సతీమణి, పిల్లలు ఉన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications