ఇది మహిళా దర్బార్ కాదు.. బీజేపీ దర్బార్: జీవన్ రెడ్డి

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాజ్ భవన్ ను రాజకీయ భవన్ గా మార్చారని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని సంప్రదాయాన్ని తెలంగాణలో గవర్నర్ తమిళిసై తీసుకువచ్చారు అంటూ ఆయన నిప్పులు చెరిగారు. గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించటం ప్రజాస్వామ్య విరుద్ధమంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 గవర్నర్ నిర్వహిస్తుంది ప్రజా దర్బార్ కాదు

గవర్నర్ నిర్వహిస్తుంది ప్రజా దర్బార్ కాదు

గవర్నర్ నిర్వహిస్తుంది ప్రజాదర్బార్ కాదని పొలిటికల్ దర్బార్ అంటూ విమర్శలు గుప్పించిన జీవన్ రెడ్డి, గవర్నర్ వ్యవస్థపై ప్రధాని మోడీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటూ మండిపడ్డారు. గవర్నర్ లుగా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు ఉండాలని గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోడీ చెప్పారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. బిజెపికి చెందిన తమిళిసై రాష్ట్రానికి గవర్నర్ గా నియమించడం మోదీ చెప్పిన నియమానికి విరుద్ధమని జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల లోనూ ప్రజా దర్బార్ లు నిర్వహించాలి

బీజేపీ పాలిత రాష్ట్రాల లోనూ ప్రజా దర్బార్ లు నిర్వహించాలి


తమిళిసై కి రాజకీయాలు చేయాలని ఆసక్తి ఉంటే బండి సంజయ్ స్థానం లో బీజేపీ కి అధ్యక్షురాలు కావాలి. ఎవరు వద్దన్నారు అంటూ ప్రశ్నించారు. కావాలంటే బీజేపీ నుంచి ఆమె రాజ్యసభ సభ్యులు కావొచ్చు ఎవరు వద్దన్నారు అంటూ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్ గా ఉండి తమిళ్ సై రాజకీయాలు చేయడానికి మేము వ్యతిరేకమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ కి చేతనైతే తమ పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ ల చేత కూడా ప్రజా దర్బార్ లు నిర్వహించాలి అంటూ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలను బీజేపీ ఇప్పటి దాకా వేధింపులకు వాడుకుంది.. ఇపుడు గవర్నర్ ను కూడా తమ ప్రత్యర్థులను వేధించేందుకు వాడుకుంటోంది అని మండిపడ్డారు.

గవర్నర్ గా ఉండి రాజకీయాలు చెయ్యటానికి తాము వ్యతిరేకం

గవర్నర్ గా ఉండి రాజకీయాలు చెయ్యటానికి తాము వ్యతిరేకం


గవర్నర్ గా ఉండి రాజకీయాలు చేయడానికి తాము వ్యతిరేకమని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది బిజెపి కుట్ర అంటూ మండిపడిన జీవన్ రెడ్డి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అంటూ తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీ మహిళా నేతలతో దర్బార్ పెడితే అది మహిళా దర్బార్ అవుతుందా అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపిన జీవన్ రెడ్డి, దేశ రాజకీయాల్లో కెసిఆర్ చక్రం తిప్పడం ఖాయమని తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని పేర్కొన్న జీవన్ రెడ్డి గుజరాత్ సీఎంగా పనిచేసిన మోడీ ప్రధాని అయ్యారని తెలంగాణ సీఎం గా ఉన్న కెసిఆర్ దేశానికి ప్రధానమంత్రి అయితే తప్పేంటి అంటూ ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ కవిత పై అరవింద్ వ్యాఖ్యలను ఖండించిన జీవన్ రెడ్డి

ఎమ్మెల్సీ కవిత పై అరవింద్ వ్యాఖ్యలను ఖండించిన జీవన్ రెడ్డి


ఎమ్మెల్సీ కవిత పై నిజామాబాద్ ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అని పేర్కొన్న జీవన్ రెడ్డి అరవింద్ నాన్న గానీ తాత గానీ ఒక్క గుడి నైనా కట్టారా అంటూ మండిపడ్డారు. సొంత నిధులతో గుడి కట్టిన కవితను హిందూత్వం ఇపుడు గుర్తొచ్చిందా అని అరవింద్ అంటాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి పునర్మిర్మించింది కేసీఆర్ కాదా అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్ లో తాము చాలా గుడులు కట్టామని వెల్లడించారు జీవన్ రెడ్డి.

బీజేపీ నేతల కన్నా గుంట నక్కలు నయం

బీజేపీ నేతల కన్నా గుంట నక్కలు నయం


బీజేపీ నేతల కన్నా గుంట నక్కలు నయం అంటూ విరుచుకుపడ్డారు. బిజెపి నేతలు ఏమైనా సత్యహరిశ్చంద్రులా అని ప్రశ్నించిన జీవన్ రెడ్డి ఎందుకు వారిపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరగడం లేదని నిలదీశారు. అదే విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. గవర్నర్ వ్యవస్థ విషయంలో ప్రధాని మోడీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి మండిపడ్డారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై నిర్వహించిన ప్రజా దర్బార్ బిజెపి దర్బార్ లా ఉందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+