హైదరాబాద్‌లో మళ్ళీ కాకరేపుతున్న మునావర్ ఫారూఖీ షో.. తగలబెట్టేస్తామని రాజాసింగ్ సీరియస్ వార్నింగ్
వివాదాస్పద స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ టూర్ తెలంగాణ రాష్ట్రంలో కాక రేపుతోంది. కామెడీ షో లో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మునావర్ ఫారూఖీ ఈనెల 20వ తేదీన హైదరాబాద్లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీంతో మళ్ళీ ఆయన కార్యక్రమాన్ని రద్దు చెయ్యాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మునావర్ ఫారూఖీ షో .. రాజాసింగ్ సీరియస్ వార్నింగ్
దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మునావర్ , ఇప్పుడు హైదరాబాద్ నగరంలోనూ తను షో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 20వ తేదీన డోంగ్రీ టు నోవేర్ పేరుతో లైవ్ షో ఏర్పాటు చేస్తున్నట్టు మునావర్ ఫారూఖీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే మునావర్ ఫారుఖీ షో విషయంలో అనేక మార్లు హెచ్చరికలు జారీ చేసిన గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మరోమారు మునావర్ ఫారూఖీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

ఫారూఖీ షో చేస్తే ఆ ప్రదేశాన్ని తగలబెడతాం: రాజాసింగ్ హెచ్చరిక
హైదరాబాద్ లో మునావర్ ఫారూఖీ షో నిర్వహిస్తే ఆ ప్రదేశాన్ని తగలబెడతాం అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫారుఖీ ఈవెంట్ నిర్వహించకుండా ఆపాలని తెలంగాణ పోలీసులకు, తెలంగాణ ప్రభుత్వానికి ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. మునావర్ ఫారూఖీకి ఎవరైనా సహకరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని తేల్చి చెప్పారు. ఫారూఖీ హైదరాబాద్ లో అడుగు పెడితే తాము చేయాల్సింది చేసి తీరుతామని హెచ్చరించారు.

కర్ణాటకలో మునావర్ షోలు బ్యాన్.. సీతాదేవిపై మునావర్ వివాదాస్పద వ్యాఖ్యలు
గతంలో జనవరి నెలలో కూడా మనావార్ ఫారూఖీ షో ఏర్పాటుపై తెలంగాణాలో రచ్చ కొనసాగింది. ఇప్పుడు మరోమారు అతను హైదరాబాద్ వస్తున్నట్టు చేసిన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ తో మరోమారు రచ్చ మొదలైంది. గతంలో ఓ కార్యక్రమంలో భాగంగా మునావర్ ఫారూఖీ సీతా దేవి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, జోక్ చేసాడు. దీంతో కర్ణాటకలో మునావర్ ఫారూఖీ షోలను బ్యాన్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ అతడు షోలు అనుమతించకూడదని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేస్తున్నారు.
Recommended Video


మళ్ళీ కాక రేపుతున్న మునావర్ షో .. అందరిలో ఉత్కంఠ
గతంలో జనవరి నెలలో మునావర్ ఫారూఖీ హైదరాబాదుకు రావాలని, షో నిర్వహించాలని ప్రయత్నించిన క్రమంలో ఫారూఖీ రాకను కేటీఆర్ స్వాగతించారు. అప్పుడు కేటీఆర్ తీరుపై ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటుగా బిజెపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెసిఆర్ కేటీఆర్ ను కలిసి హిందూ సమాజాన్ని కామెడీ చేసి పారేస్తున్నారు అంటే విమర్శలు గుప్పించారు. అయితే కేటీఆర్ మాత్రం హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరం అని, మునావర్ ఫరూఖీ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మరి ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలోకి షో పేరుతో మునావర్ ఫారూఖీ అడుగుపెడతానని చెప్పిన నేపథ్యంలో మళ్లీ ఇది ఎంత రచ్చ జరుగుతుందో అన్నది ఉత్కంఠగా మారింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications