నిరూపిస్తే రాజకీయ సన్యాసం.. నిరూపించకుంటే చెప్పుదెబ్బలు తింటావా రేవంత్ రెడ్డి: రెడ్యా నాయక్ సవాల్!!

తనపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, నిరూపించకుంటే చెప్పుదెబ్బలు తింటావా అని రెడ్యా నాయక్ సవాల్ విసిరారు.

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాటల మంటలను పుట్టిస్తుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయాలను రసవత్తరంగా మారుస్తుంది. తాజాగా రేవంత్ రెడ్డి మాజీ మంత్రి, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి రెడ్యానాయక్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

రెడ్యా నాయక్ పార్టీ మార్పుపై రేవంత్ ఆరోపణలు .. కౌంటర్ ఇచ్చిన రెడ్యా నాయక్

రెడ్యా నాయక్ పార్టీ మార్పుపై రేవంత్ ఆరోపణలు .. కౌంటర్ ఇచ్చిన రెడ్యా నాయక్

రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్యానాయక్ పార్టీ మారడం వెనుక షాకింగ్ ఆరోపణలు చేశారు. మియాపూర్ లో 5 ఎకరాల భూమి కోసమే ప్రస్తుతం ఎంపీగా ఉన్న కూతురు కవిత ఒత్తిడికి తలొగ్గి రెడ్యా నాయక్ పార్టీ మారారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన రెడ్యా నాయక్ రేవంత్ వ్యాఖ్యలు పచ్చి అబద్దాలని అభివర్ణించారు. తాను ,తన కుమార్తెకు కవిత ఎలాంటి భూముల కోసం పార్టీ మారలేదని పేర్కొన్న రెడ్యానాయక్ కాంగ్రెస్ పార్టీకి మరో 20 ఏళ్లు భవిష్యత్తు లేదు కనుక ఆ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరామని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్ లో భూమి ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్న రెడ్యా నాయక్

హైదరాబాద్ లో భూమి ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్న రెడ్యా నాయక్

హైదరాబాద్లో తనకు సెంటు భూమి కూడా లేదని పేర్కొన్న రెడ్యానాయక్, గతంలో కొంత భూమి ఉన్నప్పటికీ దానిని తర్వాత అమ్మేశామని వెల్లడించారు. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తనపై మియాపూర్ లో భూములు ఉన్నాయని ఆరోపణలు చేశారని, ఇప్పుడు అదే బాటలో రేవంత్ రెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని రెడ్యానాయక్ అసహనం వ్యక్తం చేశారు. తనకు హైదరాబాద్లో భూమి ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఒకవేళ నిరూపించలేకపోతే రేవంత్ రెడ్డి 10 చెప్పు దెబ్బలు తింటాడా అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.

కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించింది రేవంత్ రెడ్డినే

కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించింది రేవంత్ రెడ్డినే

ఇక ఇదే సమయంలో రేవంత్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రెడ్యానాయక్ పీసీసీ పదవిని డబ్బులతో కొనుక్కున్నాడని ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి పెద్ద బ్లాక్ మెయిలర్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేశాడని, రేవంత్ రెడ్డి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత వచ్చిన రెండు ఎన్నికలలోనూ కాంగ్రెస్ నేతలు డిపాజిట్లు కోల్పోయారని రెడ్యానాయక్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన, ఆయన మాటలను డోర్నకల్ ప్రజలు ఎవరు నమ్మబోరని స్పష్టం చేశారు. తన గురించి, తన నీతి, నిజాయితీ గురించి డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు తెలుసని రెడ్యా నాయక్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని హితవు పలికారు.

రేవంత్ పై భగ్గుమన్న ఎంపీ కవిత

రేవంత్ పై భగ్గుమన్న ఎంపీ కవిత

అంతకు ముందు మహబూబాబాద్ పాదయాత్రలో రేవంత్ రెడ్డి ఎంపీ కవితపై చేసిన ఆరోపణలకు ఆమె కూడా ఘాటుగా బదులిచ్చారు. మూతి పళ్ళు రాలగొడతా అంటూ రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. ఇక తాను మహబూబాబాద్ లో భూ కబ్జాలు చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు . లేదంటే అంబేద్కర్ సెంటర్ లో రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాస్తావా అంటూ ప్రశ్నించారు. గిరిజన మహిళా ప్రజా ప్రతినిధి అంటే అంత చులకనగా ఉందా? ఏం మాట్లాడినా చెల్లుతుందని గర్వమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+