రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ రావటానికి కారణం ఇదే .. ఆ కోరిక తీర్చిన దేవతల వద్దకు సీతక్క !!
కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర రథసారధిగా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పట్టం కట్టింది. మొదటి నుంచి రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా నియమించవద్దని కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లు బాహాటంగానే విమర్శలు చేశారు. ఇక ఢిల్లీ వెళ్లి మరి ఆయనకు పదవి రాకుండా ఉండాలని చక్రం తిప్పిన వాళ్ళు కూడా లేకపోలేదు. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నూతనోత్సాహం రావాలంటే, మళ్లీ జవసత్వాలు నిండాలంటే, రేవంత్ రెడ్డి నాయకత్వం కావాలని కోరుకున్న వారు లేకపోలేదు.అయితే ఎమ్మెల్యే సీతక్క రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ గా వారే కోరిక తీర్చారని చెప్పారు. ఇంతకీ సీతక్క ఏం చెప్పారంటే..
Recommended Video
రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ రావటానికి కారణం ఇదే .. ఆ కోరిక తీర్చిన దేవతల వద్దకు సీతక్క !!#RevanthReddy #RevanthreddyPCC #Congress #Mlaseethakka pic.twitter.com/lHpeInwCkl
— oneindiatelugu (@oneindiatelugu) June 28, 2021

రేవంత్ రెడ్డి కోసం సీతక్క మొక్కు .. నేడు మేడారం వెళ్లిన సీతక్క
రేవంత్ రెడ్డి కి టీపీసీసీ చీఫ్ పదవి రావాలని కోరుకున్న వారిలో ప్రధానంగా చెప్పదగిన వ్యక్తి ములుగు ఎమ్మెల్యే సీతక్క. రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి దక్కాలని సమ్మక్క సారలమ్మలకు మొక్కుకున్నారట సీతక్క. ఈరోజు మేడారంలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న ఎమ్మెల్యే సీతక్క రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇవ్వడంపై అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. తన కోరిక తీర్చిన సమ్మక్క సారలమ్మలను ఈరోజు దర్శించుకున్నానని ఆమె స్వయంగా వెల్లడించారు .

రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరం కలిసి పని చేద్దాం అన్న సీతక్క
రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తాను చిన్ననాటి నుండి కొలిచిన సమ్మక్క, సారలమ్మలు నేడు తన కోరిక తీర్చారని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ, ఒక తాటి మీదికి రావాలని రాష్ట్రంలో అధికారమే ధ్యేయంగా, ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా పనిచేయాలని సీతక్క విజ్ఞప్తి చేశారు .

రేవంత్ తో పాటే పార్టీలో చేరిన సీతక్క .. మేడారంలో మొక్కులు చెల్లింపు
తెలంగాణ రాష్ట్ర నూతన నాయకత్వ దిశా నిర్దేశం మేరకు అందరూ కలిసి ముందుకు నడవాలని ఎమ్మెల్యే సీతక్క కోరారు. ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మేడారం వెళ్లి ఈ రోజు అమ్మవార్లకు మొక్కులు సమర్పించిన సీతక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది గత కొంత కాలంగా రేవంత్ రెడ్డి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారని ఈరోజు ఆ కోరిక తీరింది అని వ్యాఖ్యానించారు. సమ్మక్క, సారలమ్మలు చాలా మహిమాన్వితమైన అమ్మవార్లని చెప్పిన సీతక్క వచ్చే జాతరలో కూడా తాను మొక్కులు చెల్లించుకుంటా అని చెప్పారు .

వనదేవతల మహిమ వల్లే రేవంత్ రెడ్డి కి టీపీసీసీ చీఫ్
రేవంత్ రెడ్డి తో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరిన సీతక్క, రేవంత్ రెడ్డిని సోదరుడిగా భావిస్తారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం తెలంగాణ రథసారథి గా పట్టం కట్టడం రేవంత్ వర్గంగా ముద్రపడిన సీతక్కకు సంతోషం కలిగిస్తుంది. పార్టీ రేవంత్ కు సముచిత స్థానం ఇచ్చిందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకపక్క చంద్రబాబు వల్లే రేవంత్ రెడ్డికి పదవి వచ్చిందని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువగా మారిన వేళ ఎమ్మెల్యే సీతక్క వనదేవతల మహిమే ఈ రోజు రేవంత్ రెడ్డి ని టీపీసీసీ చీఫ్ గా మార్చిందని చెప్పారు.












Click it and Unblock the Notifications