వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ నుండి వచ్చి నీ పెత్తనం ఏంటి?ఎంపీ కవితను అవమానించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర రైతాంగం సాగుచేసిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జిల్లా కేంద్రాలలో టిఆర్ఎస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడుతున్న క్రమంలో ఎంపీ కవిత చేతిలోనుంచి మైక్ లాక్కున్నారు మహబూబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్. అంతేకాదు చాలా అవమానకర వ్యాఖ్యలు కూడా చేశారు.

మంత్రి ఎర్రబెల్లి వర్సెస్ నన్నపునేని నరేందర్; రైతు దీక్షలో బయటపడ్డ టీఆర్ఎస్ నేతల అంతర్గతపోరుమంత్రి ఎర్రబెల్లి వర్సెస్ నన్నపునేని నరేందర్; రైతు దీక్షలో బయటపడ్డ టీఆర్ఎస్ నేతల అంతర్గతపోరు

 రైతు నిరసన దీక్షలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ వివాదం

రైతు నిరసన దీక్షలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ వివాదం


రైతు దీక్ష సందర్భంగా టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరిగిన రైతు దీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొనగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ రైతు దీక్షకు హాజరుకాకుండా మంత్రి పట్ల తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారం పార్టీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారగా, ఇదే సమయంలో మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన రైతుల నిరసన దీక్షలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ వివాదాస్పదంగా వ్యవహరించారు.

ఎంపీ కవితను అవమానించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

ఎంపీ కవితను అవమానించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్


రైతు నిరసన దీక్షలో ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతున్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆమె చేతిలో నుండి మైక్ లాక్కున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలోనే ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎంపీ కవిత ను దారుణంగా అవమానించారు. ఎంపీ కవిత మైక్ తీసుకొని మాట్లాడుతున్న క్రమంలో నేను మాట్లాడతా అంటూ వచ్చిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్యలో వచ్చిన వాళ్ళు మీరు.. కాంగ్రెస్ నుంచి వచ్చి నీ పెత్తనం ఏంటి.. పో పో అంటూ ఎంపీ కవిత చేతిలోనుండి మైక్ ను బలవంతంగా లాక్కున్నారు.

మహబూబాబాద్ టీఆర్ఎస్ నేతల్లో ఆధిపత్యపోరు

మహబూబాబాద్ టీఆర్ఎస్ నేతల్లో ఆధిపత్యపోరు


దీంతో ఒక్కసారిగా కంగు తిన్న కవిత దిక్కుతోచని స్థితిలో సైలెంటుగా కూర్చున్నారు. అంతమంది ముందు ఎమ్మెల్యే తీరుకు ఆమె ఇబ్బందిపడ్డారు. ఎంపీ కవిత అక్కడే ఉన్న టిఆర్ఎస్ నేత తక్కెళ్లపల్లి రవీందర్ రావు తో తన ఆవేదనను వెళ్ళగక్కారు. గత కొంత కాలంగా మహబూబాద్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ నేతలలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు రైతు దీక్ష సాక్షిగా ఈ రోజు బయటకు వచ్చింది. ఇది పార్టీ శ్రేణులలో చర్చనీయాంశంగా మారింది.

మహబూబాబాద్ టీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు.. స్థానికంగా చర్చ

మహబూబాబాద్ టీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు.. స్థానికంగా చర్చ


మహబూబాబాద్ జిల్లాకు మంత్రిగా ఉన్న సత్యవతి రాథోడ్ కు, ఎమ్మెల్యే రెడ్యానాయక్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇక ఇదే సమయంలో మహబూబాబాద్ ఎంపీ కవిత కు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు మధ్య ఏ మాత్రం పొసగడం లేదు. స్థానికంగా చోటుచేసుకున్న అధిపత్యపోరులో ఎవరికి వారు పెత్తనం చెలాయించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మహబూబాద్ జిల్లాలో నేడు జరిగిన రైతు దీక్షలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవిత పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఇప్పటికే అనేక వివాదాలతో రాజకీయాలలో చర్చనీయాంశమైన ఎమ్మెల్యే శంకర్ నాయక్ తాజాగా గిరిజన మహిళ ఎంపీ అయిన కవితను అవమానించి మరోమారు వార్తల్లో నిలిచారు.

English summary
An internal quarrel broke out between TRS leaders in Mahabubabad district as a witness to the farmer protests. MLA Shankar Nayak taken mike from MP Kavitha's hand and made controversial remarks on MP Kavitha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X