బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ పై పైలట్ రోహిత్ సంచలన ఆరోపణలు..!!
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ పై సంచలన ఆరోపణలు చేసారు. తాజాగా రోహిత్ రెడ్డి విద్యార్హతలపై ప్రశ్నలతో పాటుగా కొన్ని విమర్శలు చేసారు. దీంతో, ఇప్పుడు పైలెట్ నేరుగా రఘునందన్ ను టార్గెట్ చేసారు. బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు వాస్తవమని రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. హైదరాబాద్‌లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న రోహిత్ రెడ్డి.. దమ్ముంటే భాగ్యలక్ష్మి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆలయానికి రావాలని.. కర్ణాటక కేసుపై ప్రమాణం చేద్దామని బండి సంజయ్‌కి సవాల్ చేసారు.
రోహిత్ రెడ్డి నేడు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చారు. బండి సంజయ్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బండి సంజయ్ మాటలు అబద్దమని మరోసారి స్పష్టమైందని చెప్పుకొచ్చారు. కరీంనగర్ లోని వేములవాడ లేదంటే తాండూరులో ను భద్రేశ్వరాలయంకు రావాలని ఛాలెంజ్ చేసారు. తన మీద వచ్చిన ఆరోపణల విషయంలో తగ్గేదే లేదని... బీజేపీ నేతల ఆటలు సాగవని హెచ్చరించారు. బీజేపీ నేతలు తమ తప్పును కప్పి పుచ్చుకోవడనికి అనేక రకాల అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు.

ఈడి వ్యవహారాన్ని మేము తప్పు బడితే ఎందుకు ఇంత ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. కావాలనే బీజేపీ నేతలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో బిజినెస్ మన్ లను, కీలక నేతలను టార్గెట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. తన పై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలకు అమ్మవారి దేవాలయం ముందు సవాల్ విరిసిన సంజయ్ ఎందుకు స్పందించడం లేదని నిలదీసారు. బండి సంజయ్ హిందుత్వం పేరిట ప్రజలని తప్పు దోవ పట్టిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసారు.
భాగ్య లక్ష్మి అమ్మవారి దేవాలయనికి సంజయ్ రాలేదంటే తన తప్పును నువ్వు ఒప్పుకున్నట్లేనని చెప్పుకొచ్చారు. రఘునందన్ రావు దగ్గరకు సహాయం కోసం వచ్చిన మహిళకు మత్తుమందు ఇచ్చి లోబర్చు కున్నారంటూ సంచలన ఆరపణలు చేసారు. పఠాన్ చెరులో ఉన్న చాలా మందిని బెదిరించడం వాస్తవం కాదా అని నిలదీసారు. పరిశ్రమల యజమానులను బెదిరించారని ఆరోపించారు. స్ట్రింగర్ గా ఉంటూ వందల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు.

పది కోట్ల విల్లా, ఖరీదైన హోటల్ లో రూంలు, కోట్లాది రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయంటూ పైలెట్ రోహిత్ ప్రశ్నలు సంధించారు. పేరున్న అడ్వకేట్ గా చెప్పుకుంటున్న రఘు నందన్ రావు కేసుల పేరిట ఆడవారిని మోసం చేయడం నిజం కాదా అంటూ వ్యాఖ్యానించారు. ఏంఐఎం నేతలతో టచ్ లో ఉన్నది సుద్దపూస రఘునందన్ రావు అని ఎద్దేవా చేసారు. తాను అమెరికాలో పైలట్ కోర్సు చేసానని.. విచారణ చేసుకోవాలని సూచించారు. అవసరం అయితే ఫ్లైట్ టిక్కెట్లు నేనే ఏర్పాటు చేస్తా.












Click it and Unblock the Notifications