వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేల ఎరకేసు: సిట్ నోటీసులపై కోర్టులో జగ్గుస్వామి క్వాష్ పిటీషన్; మళ్ళీ వారికి నోటీసులు!!

|
Google Oneindia TeluguNews

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో రోజుకో ట్విస్ట్ తెర మీదికి వస్తుంది. సిట్ విచారణలో దూకుడుగా ముందుకు వెళ్లాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంటే, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కోర్టు మెట్లు ఎక్కి తమని తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న బి ఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టులో సిట్ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, తాజాగా ఈ కేసులో అనుమానితులుగా ఉన్న, నోటీసులు అందుకున్న జగ్గు స్వామి తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

తెలంగాణా హైకోర్టులో జగ్గూ స్వామి క్వాష్ పిటీషన్

తెలంగాణా హైకోర్టులో జగ్గూ స్వామి క్వాష్ పిటీషన్

కేరళకు చెందిన జగ్గు స్వామిని విచారించడం కోసం తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ జారీ చేసిన 41ఏ సీఆర్పీసీ నోటీసులు, లుకౌట్ నోటీసులపై స్టే ఇవ్వాలని ఆయన తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కోరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని జగ్గు స్వామి పిటిషన్లో వెల్లడించారు. ఇక జగ్గుస్వామి పిటిషన్ ను హైకోర్టు సోమవారం విచారించే అవకాశం ఉంది.

జగ్గు స్వామి క్వాష్ పిటీషన్ విచారించనున్న తెలంగాణా హైకోర్టు

జగ్గు స్వామి క్వాష్ పిటీషన్ విచారించనున్న తెలంగాణా హైకోర్టు

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో దర్యాప్తు జరుపుతున్న సిట్ బృందం తుషార్ ను రామచంద్ర భారతికి పరిచయం చేసిన కేరళ వైద్యుడు జగ్గు స్వామి అని గుర్తించారు. జగ్గు స్వామికి సంబంధించిన కీలక ఆధారాలు సేకరించిన సిట్ బృందం ఈయన తుషార్ కు రామచంద్ర భారతికి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు గా గుర్తించారు. ఈ క్రమంలో అతనిని విచారిస్తే ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉంటుందని భావించిన బృందం జగ్గు స్వామికి నోటీసులు జారీ చేసింది. ఓ మారు సిట్ కొచ్చికి కూడా వెళ్లి వచ్చింది. అయితే అతను అప్పటికే అక్కడినుండి తప్పించుకొని పోయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో తాజాగా జగ్గు స్వామి కోర్టులో పిటిషన్ వేయడంతో, తెలంగాణా హైకోర్టు సోమవారం నాడు విచారణ జరపనుంది.

కోర్టు మెట్లెక్కుతున్న అనుమానితులు

కోర్టు మెట్లెక్కుతున్న అనుమానితులు

ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో తనకు పంపించిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ బీఎల్ సంతోష్ కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు కొనుగోలు కేసులో సిట్ తనకు ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని ఆయన కోర్టుకి విజ్ఞప్తి చేశారు. తనకు నోటీసులను ఇవ్వడం చట్టవిరుద్ధమని బిఎల్ సంతోష్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే దీనిపై కోర్టు బీఎల్ సంతోష్ కు ఊరటనిచ్చింది. సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులపై డిసెంబర్ 5 వ తేదీ వరకు స్టే విధించింది. బీఎల్ ను అరెస్ట్ చెయ్యటానికి వీలు లేదని కోర్టు ఆదేశించింది. తుషార్ కూడా కోర్టును ఆశ్రయించటంతో ఆయనను అరెస్ట్ చెయ్యొద్దని కోర్టు సిట్ కు ఆదేశాలను ఇచ్చింది.

మళ్ళీ తుషార్, జగ్గుస్వామిలకు సిట్ నోటీసులు

మళ్ళీ తుషార్, జగ్గుస్వామిలకు సిట్ నోటీసులు


ఇదిలా ఉంటే ఎమ్మెల్యేలు కొనుగోలు కేసు దర్యాప్తుపై తెలంగాణ సిట్ అధికారులు మరోమారు కేరళకు వెళ్లి తుషార్ మరియు జగ్గు స్వామి లకు నోటీసులు అందజేశారు. తుషార్ ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు విచారణకు హాజరు కావాలని నోటీసులు అందించారు. అలాగే కొచ్చిలో జగ్గు స్వామి నివాసానికి చేరుకున్న అధికారులు మరోమారు ఆయనకు నోటీసులు అందజేశారు.

ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ: తెలంగాణాలో సీబీఐ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్టేనా?ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ: తెలంగాణాలో సీబీఐ ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్టేనా?

English summary
Another shocking twist has taken place in the case of MLAs poaching case. Jaggu swamy filed a quash petition in the court against the sit notices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X