హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రానిది ముమ్మాటికీ వివక్షే.. ఆ జాబితా పోస్ట్ చేసి ఎమ్మెల్సీ కవిత ఫైర్

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత కేంద్రంలోని అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ మరోమారు విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పక్షపాత వైఖరి పై మండిపడిన కవిత కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై మొదటి నుంచి సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం వివక్షపై కవిత ఫైర్... ఆ జాబితా ట్వీట్ చేసిన కవిత

కేంద్రం వివక్షపై కవిత ఫైర్... ఆ జాబితా ట్వీట్ చేసిన కవిత


2021- 22 సంవత్సరానికి ఆయా రాష్ట్రాలకు కేటాయించిన వరద సహాయం నిధుల జాబితాను ఎన్డిఆర్ఎఫ్ రెండు రోజుల క్రితం విడుదల చేసింది. ఇక ఆ జాబితాలో తెలంగాణ పేరు లేకపోవడాన్ని ప్రస్తావించిన కవిత కేంద్రం విడుదల చేసిన జాబితాను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ బిజెపి పక్షపాత వైఖరిపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ ప్రజలకు వరద సాయం అందించడంలోనూ బిజెపి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కవిత మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంపై పూర్తిగా వివక్ష చూపిస్తోందని ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు.

తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఒక్క పైసా కూడా వరద సాయం చెయ్యలేదు

హైదరాబాద్ వరదల సమయంలో సీఎం కేసీఆర్ బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉన్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ ఆదుకోలేదని పేర్కొన్న కవిత తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్ష పూరిత వైఖరి మనసును కలచి వేస్తోంది అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 2021-22 లో అనేక రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ నిధులను మంజూరు చేసిన కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని కవిత పేర్కొన్నారు.

వరద సాయం లేదు, ఎన్డీఆర్ఎఫ్ నిధులు లేవు

వరద సాయం లేదు, ఎన్డీఆర్ఎఫ్ నిధులు లేవు

తెలంగాణ ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలకు 10 వేల చొప్పున ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నదని వెల్లడించిన కవిత సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాసినప్పటికీ స్పందించలేదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఇప్పటి వరకు నయా పైసా నిధులు రాలేదని వెల్లడించిన కవిత వరద బీభత్సంతో విలవిలలాడిన తెలంగాణ రాష్ట్రానికి 1350 కోట్ల రూపాయల తక్షణ సహాయం, 5 వేల కోట్ల రూపాయల ఎన్డిఆర్ఎఫ్ నిధులను ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

Recommended Video

MLC Kavitha : దేశ‌ జీడీపీని పెంచకుండా, గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్ పెంచుతున్నారు | Oneindia Telugu

ధాన్యం కొనుగోలుపైనా కేంద్రాన్ని కవిత టార్గెట్

ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పైన కూడా కవిత కేంద్రాన్ని టార్గెట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు శూన్యం అని పేర్కొన్న కవిత తెలంగాణ రైతులకు కేంద్రం మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు. ఎఫ్సీఐకి సరైన సేకరణ విధానం లేదని కవిత పేర్కొన్నారు. వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేయాలని మేము ఎఫ్‌సిఐకి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కాబట్టి రాష్ట్ర రైతాంగం తదనుగుణంగా పంటలు సాగు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ధాన్యం సేకరణ ఒకే విధంగా ఉండాలని కవిత డిమాండ్ చేశారు.

కేంద్రంలోని బిజెపి సర్కార్ ను రైతు వ్యతిరేక బీజేపీ గా పేర్కొన్న కవిత

కేంద్రంలోని బిజెపి సర్కార్ ను రైతు వ్యతిరేక బీజేపీ గా పేర్కొన్న కవిత

తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం పక్షపాత హద్దులన్నీ దాటేసిందని పేర్కొన్న కవిత సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ - మన రైతులు, వారి శ్రమను దృష్టిలో పెట్టుకొని పంటల విషయంలో వెనక్కి తగ్గదని వెల్లడించారు. మోడీ ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రతి ధాన్యం గింజను మన రైతుల నుండి సేకరించాలన్నారు కవిత. కేంద్రంలోని బిజెపి సర్కార్ ను రైతు వ్యతిరేక బీజేపీ గా కవిత అభివర్ణించారు.

English summary
MLC Kavitha was incensed over paddy procurement as well as the Centre's attitude of not helping Hyderabad in the floods. Kavitha, who tweeted a list of flood-hit states as a Twitter platform, was outraged at the discrimination on telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X