MLC Kavitha: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో ఏం జరిగింది?.. వివరించిన కవిత
MLC Kavitha: రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన కేసీఆర్ కుటుంబంలో ఇటీవల చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. అయితే ఇటీవల ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసేందుకు ఎమ్మెల్సీ కవిత వెళ్లింది. ఈ క్రమంలో కవితను పలకరించకుండానే కేసీఆర్ బయటకు వెళ్లిపోయారంటూ వార్తలు వచ్చాయి. దానిపై ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో తన తండ్రి కేసీఆర్‌తో మాట్లాడానో.. లేదో ఇప్పుడు అవసరం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తేల్చిచెప్పారు. ఎమ్మెల్సీ కవిత మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ. ఈ అంశంపై నోరు విప్పారు. ఫాంహౌస్‌కు వెళ్లినప్పుడు కేసీఆర్‌తో మాట్లాడానో లేదో అనేది ఇప్పుడు అనవసరమైన విషయం అంటూ కొట్టిపారేశారు.
మరోవైపు కేటీఆర్ విచారణకు వెళ్తున్నప్పుడు వెళ్లాలో.. వద్దో అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కవిత పేర్కొన్నారు. అయినా విచారణ సమయంలో ఎవరినీ రానీయకుండా దూరంగానే అడ్డుకుంటున్నారు కదా అంటూ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా..కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లిన విషయం గురించి కూడా చెప్పారు. కేసీఆర్ సాధారణ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లారని చెప్పారు. ఎముకకు ఇంజెక్షన్ వేయించుకుంటున్నారని.. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న చికిత్స ఇప్పుడు జరుగుతోందని కవిత చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని కలిసి 26 అంశాలపై వినతిపత్రం ఇచ్చారని.. కానీ అందులో బీసీ బిల్లు లేదని కవిత అన్నారు. బీసీ బిల్లు అమలు కావాలనే చిత్తశుద్ధి సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు. బీసీ బిల్లు అమలు కోసం గట్టిగా పోరాటం చేస్తామని ఎమ్మెల్యే కవిత అన్నారు. ఈ నెల 17వ తేదీని జాగృతి ఆధ్వర్యంలో మెదక్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామని కాంగ్రెస్ చెప్పడం సరైంది కాదన్నారు. ఏదేమైనా కవిత ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కు వెళ్లడం అందరిని విస్మయానికి గురి చేసింది. కవిత తీరుపై కేసీఆర్ అప్పటికే ఆగ్రహంతో ఉన్నారని అందువల్ల తనను కలిసేందుకు వచ్చిన కవితను పట్టించుకోలేదనే ప్రచారం కూడా జరిగింది.












Click it and Unblock the Notifications