అతనొక లిల్లీపుట్, ఇదంతా ఆ పెద్ద నాయకుడి కుట్ర - కవిత సంచలనం..!!

ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. బీర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ కీలక అంశాలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. జగదీష్ ఒక లిల్లీపుట్ అని హాట్ కామెంట్స్ చేశారు. తనపై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనుక ఒక బీఆర్ఎస్ పార్టీ కీలక నేత ఉన్నారని కవిత చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలనంగా మారుతోంది.

కొంత కాలంగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ లోని నేతలను టార్గెట్ చేస్తూ కవిత వ్యాఖ్యలు చేసారు. కవిత తన తండ్రికి రాసిన లేఖ బయటకు రావటం .. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలు గులాబీ పార్టీలో సంచలనంగా మారాయి. ఇక, తాజాగా కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. ఇంటి ఆడబిడ్డపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. బీఆర్ఎస్‌ నేతలు స్పందించలేదని ఆమె ఆగ్రహాన్ని బయటపెట్టారు. తన మీద వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్‌లోని పెద్ద నాయకుడి కుట్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పైన కవిత ఆగ్రహం వ్యక్తం చేసారు. నల్గొండ జిల్లాలో ఒక్కడు గెలిచారని.. కేసీఆర్ లేకపోతే జగదీష్ రెడ్డిని ఎవరు చూస్తారని వ్యాఖ్యానించారు.

mlc-kavitha-criticised-jagadish-reddy-and-called-him-lilliput

జగదీష్‌రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండలో బీఆర్‌ఎస్‌ను నాశనం చేసిందే జగదీష్‌రెడ్డి అని విరుచుకపడ్డారు. నా మీద నీచంగా మాట్లాడతారా? ఇదేనా రాజకీయం? అని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రికి రాసిన లేఖను బహిర్గతం చేశారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్‌ నాయకులే.. తన పై అనుచితంగా మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. కాగా ఇటీవల ఒక మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవితను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలకు ఈరోజు కవిత కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ లో కవిత వ్యవహారం పైన పార్టీ నేతలు ఎవరూ మాట్లాడవద్దని ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేసారు. కాగా, కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+